ఇటీవలే సొంతగడ్డపై అదరగొట్టి వరుస విజయాలను అందుకున్నా టీమిండియా మరికొన్ని రోజుల్లో సౌత్ ఆఫ్రికా పర్యటనకు బయలుదేరే పోతుంది. ఇటీవల స్వదేశంలో జరిగిన టి20 టెస్ట్ సిరీస్ లో న్యూజిలాండ్ పై పూర్తి ఆదిపత్యాన్ని సాధించ్చింది టీమిండియా. టీ20 సిరీస్ లో భాగంగా వరుసగా మూడు మ్యాచ్లో గెలిచి న్యూజిలాండ్ ను క్లీన్స్వీప్ చేసింది. ఇక ఆ తర్వాత  టెస్టు సిరీస్లో టీమిండియా బాగా రాణించింది అని చెప్పాలి. మొదటి మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ రెండో మ్యాచ్లో ఏకంగా భారీ తేడాతో విజయం సాధించింది. ఇలా వరుస విజయాలతో ఎంతో దూకుడు మీద ఉంది టీమిండియా.



 అదే జోష్ తో అటు సౌత్ ఆఫ్రికా పర్యటనకు బయలుదేరేందుకు సిద్ధమైంది. ఇక సౌత్ఆఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా ఎలా అలరించబోతోంది అనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే భారత జట్టు ఏదైనా పర్యటనకు వెళ్లిన సమయంలో మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ టీమిండియా బలాబలాలు ఏంటి అన్న విషయాన్ని గురించి చెబుతూ ఉంటారు. టీమిండియా ఎలా రాణిస్తే  విజయం సాధిస్తుంది అన్న విషయంపై ఎప్పుడు అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం..



 ఈ క్రమంలోనే టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికా పర్యటనపై ఇటీవలె స్పందించిన దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సౌత్ఆఫ్రికా సిరీస్ లో భారత్ హాట్ ఫేవరేట్ అంటూ వ్యాఖ్యానించాడు దినేష్ కార్తీక్. సఫారీ జట్టు బ్యాటింగ్ లైనప్ ఎంతో బలహీనంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.ఇక సౌత్ ఆఫ్రికా జట్టులో డికాక్, బవుమా లను త్వరగా వికెట్ తీస్తే ఇక భారత్ ఎంతో సునాయాసంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో రబడా, నోర్జె లతో సౌత్ ఆఫ్రికా బౌలింగ్  విభాగం ఎంతో బలంగా ఉంది అంటూ తెలిపాడు. వాళ్లను ఎదుర్కొనేందుకు భారత బ్యాటింగ్ లైనప్ సిద్ధంగా ఉండాలి అంటూ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: