అంతే కాకుండా ఏ ఆటగాడిని ఏ కేటగిరీలో తీసుకోబోతున్నారు అనే విషయంపై కూడా స్పష్టత ఇస్తూ ఉంటాయి. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్ లో రెండు రకాల కేటగిరీలు ఉంటాయి.. ఒకటి డైమండ్ కేటగిరి అయితే మరొకటి సిల్వర్ కేటగిరి స్టార్ ప్లేయర్స్ ని డైమండ్ కేటగిరిలో తీసుకుంటూ ఉంటారు. యువ ఆటగాళ్లను సిల్వర్ కేటగిరిలో తీసుకోవడం చేస్తూ ఉంటారు. అయితే డైమండ్ కేటగిరీలో అవకాశం దక్కించుకోవాలని ఎంతో మంది యువ ఆటగాళ్లు భావిస్తూ ఉంటారు.
ఇకపోతే ఇటీవలే పాకిస్థాన్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ పాకిస్తాన్ సూపర్ లీగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా షఫావర్ జెల్మీ జట్టు వెటరన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ను తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే అంతకు ముందులా డైమండ్ కేటగిరీలో కాకుండా సిల్వర్ కేటగిరిలో తీసుకుంటున్నట్లు తెలిపింది జట్టు ఫ్రాంచైజీ. ఇక తనను డైమండ్ కేటగిరీలో తీసుకోవడంపై వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ హర్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్లీజ్ నన్ను వదిలేయండి.. నేను ఈ కేటగిరీలో ఆడటానికి అర్హుడిని కాదు.. దాదాపు ఆరేళ్ల నుంచి జట్టుతో ఉన్నందుకు జట్టు యాజమాన్యం తనపై చూపించిన సానుభూతి నాకు అవసరం లేదు అంటూ కమ్రాన్ అక్మల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి