భారత్ కు వరుసగా ఒలంపిక్స్ లో రెండుసార్లు పథకాలను అందించి భారత ప్రజల గౌరవాన్ని నిలబెట్టింది స్టార్ షట్లర్ పీవీ సింధు.  కేవలం ఒలంపిక్స్ లో మాత్రమే కాదు ఇప్పటి వరకు ఎన్నో పోటీలలో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి ఎంతో అద్భుతంగా విజయం సాధిస్తూ ఆధిపత్యాన్ని కొనసాగించే సింధు కానీ ఫైనల్లో మాత్రం తరచూ ఓడిపోతూ ఉండడం అభిమానులందరినీ నిరాశపరుస్తుంది.  గత కొంతకాలం నుంచి కీలక టోర్నీలలో మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన పీవీ సింధు ఫైనల్ మ్యాచ్ లలో మాత్రం తడబడుతూ వస్తుంది.



 దీంతో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకి ఫైనల్ ఫోబియా  ఉంది అంటూ ఎన్నోసార్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి. మొదట్లో సింధు ఎంత బాగా రాణించినప్పటికీ చివరికి ఫైనల్కు వెళ్లేసరికి మాత్రం తడబడుతూ ఓటమి పాలు అవుతుంది అంటూ సోషల్ మీడియాలో ఎన్నోసార్లు  ఎంతోమంది విమర్శలు చేశారు. పలుమార్లు పి.వి.సింధు ఇలాంటి విమర్శలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. ఇక ఇప్పుడు కీలకమైన పోరులో మరో సారీ క్వార్టర్ ఫైనల్స్ లో పి.వి.సింధు ఓటమి పాలు కావడం అభిమానులందరి నిరాశపరిచింది.



 ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ట్రోఫీ జరుగుతుంది. ఇక ఈ ట్రోఫీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగింది. వరుస విజయాలను అందుకుంటు దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఫైనల్ లో విజయం సాధిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ క్వార్టర్ ఫైనల్స్ లో చివరికి ఓటమి పాలు అయింది. ఎక్కడా కూడా కనీస పోటీ ఇవ్వలేకపోయింది పి.వి.సింధు. చైనీస్ తైపీ కి చెందిన తైజు యింగ్ చేతిలో ఓటమిపాలైంది. 17- 21 13 -21 తేడాతో ఓడి చివరికి ట్రోఫీ నుంచి నిష్క్రమించింది. అయితే అంతకుముందు ఒలంపిక్స్లో కూడా సింధు ఆమె చేతుల్లోనే ఓడి కాంశ్యం తో సరిపెట్టుకుంది అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: