ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా వరుసగా మ్యాచ్ లలో ఓడిపోతూ  అభిమానులందరినీ నిరాశపరుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల సౌత్ఆఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ కూడా ఓడిపోయిన టీమిండియా  ఇక వన్డే సిరీస్లో అయినా అద్భుతంగా రాణిస్తూ ఉంది అనుకుంటే ఇక మొదటి వన్డే మ్యాచ్లో ఓడిపోయింది. అయితే ఇలా ఒక వైపు భారత అంతర్జాతీయ జట్టు నిరాశపరుస్తూ ఉంటే.. అటు అండర్-19 జట్టు మాత్రం అద్భుతంగా రాణిస్తూ టీమిండియా అభిమానులందరి లో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది అని చెప్పాలి.


 ప్రస్తుతం అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా వరుస విజయాలతో దూసుకుపోతుంది టీమిండియా. మొదటి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా పై విజయం సాధించి సత్తా చాటిన టీమిండియా ఆ తర్వాత  మ్యాచ్ లలో కూడా ఇదే జోరు కొనసాగిస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటికే బలమైన దక్షిణాఫ్రికాను చిత్తుచేసిన భారత కుర్రాళ్లు ఇక ఇప్పుడు పసికూన ఐర్లాండ్ నూ కూడా మట్టికరిపించారు. ఏకంగా భారీ పరుగుల తేడాతో విజయం సాధించారు. అయితే కరోనా వైరస్ కారణంగా కెప్టెన్ ధోనీ సహా కొంతమంది కీలక ఆటగాళ్లు జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ విశాల్ సింధు నేతృత్వంలో బరిలోకి దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 307పరుగులు చేసింది.


 ఇక ఇద్దరు భారత ఓపెనర్లు కూడా 88, 79 పరుగులతో అద్భుతంగా రాణించారు. ఇక మొత్తంగా 50 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 307 పరుగులు చేశారు.. అయితే ఆ తర్వాత బౌలింగ్ లో కూడా భారత కుర్రాళ్లు అద్భుతం సృష్టించారు అనే చెప్పాలి. ఏకంగా 39 ఓవర్లలో 133 పరుగులకే ఐర్లాండ్ జట్టును ఆల్ అవుట్ చేశారు భారత ఆటగాళ్లు. దీంతో 174 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది భారత అండర్-19 జట్టు. అయితే భారత బౌలర్ల ధాటికి అటు ఐర్లాండ్ బెంబేలెత్తి పోయిందనే చెప్పాలి. ఏ దశలో కూడా విజయం సాధిస్తుంది అన్నట్లుగా ఐర్లాండ్ బ్యాటింగ్ చేయలేకపోయింది. కేవలం 10 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఐర్లాండ్ బ్యాటింగ్ విభాగం పేకమేడలా కుప్పకూలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: