ఇక ఈ అద్భుతమైన విజయం పై మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ యువకుల ప్రతిభను కొనియాడుతున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వివిఎస్ లక్ష్మణ్ స్పందించాడు. ఇండియా కుర్రాళ్లు గెలిచిన ప్రపంచ కప్ టైటిల్ ఎంతో ప్రత్యేకం అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. టోర్నీ మధ్యలో కీలక ఆటగాళ్లు కరోనా వైరస్ బారినపడి దూరమైనప్పటికీ.. యువ భారత్ మాత్రం వెనకడుగు వేయకుండా ధైర్యంతో ముందుకు సాగింది. ఇక ఇప్పుడు ప్రపంచ కప్ టైటిల్ గెలిచిందని లక్ష్మణ్ అన్నాడు. ఇక ఈ సందర్భంగా అండర్ 19 హెడ్ కోచ్ కనిత్కర్, సహాయ సిబ్బందిపై కూడా ప్రశంసలు కురిపించాడు.
అదే సమయంలో వి.వి.ఎస్.లక్ష్మణ్ పై కూడా ప్రస్తుతం ప్రశంసలు కురిపిస్తున్నారు ఎంతోమంది.. అతను వచ్చాడు టీమిండియా తలరాత మారిపోయింది అని అంటున్నారు. ఎంసీఏ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న వివిఎస్ లక్ష్మణ్ వెరీ స్పెషల్ అంటూ పొగిడేస్తున్నారు. యువ ఆటగాళ్లను రాటుదేలేల చేయడానికి ఎంతో కృషి చేశారు ఆటగాళ్లు ఎక్కడికి పర్యటనకు వెళ్లిన వి.వి.ఎస్.లక్ష్మణ్ వెంటే ఉంటూ ఆటగాళ్లను దగ్గరుండి ప్రోత్సహిస్తూ ధైర్యం నింపేవారు ఫలితంగా ఆయన పర్యవేక్షణలో యువభారత్ అద్భుతంగా పటిష్టం గా మారిపోయింది. వరుసగా రెండు ఐసీసీ టైటిల్ను సొంతం చేసుకుంది అంటూ క్రికెట్అభిమానులు విశ్లేషకులు వి.వి.ఎస్.లక్ష్మణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి