కాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపెనర్ గా కొనసాగుతున్న ఫాబ్ డుప్లెసిస్ ను మళ్లీ దక్కించుకోవాలని అనుకుంది చెన్నై సూపర్ కింగ్స్ యజమాన్యం. ఇక దీని కోసం తమదైన శైలిలో ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ లో కొనసాగుతున్న డుప్లెసిస్ అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకుంటున్నాడు చెన్నై జట్టు టైటిల్ కొట్టడం లో కూడా కీలకపాత్ర వహిస్తున్నాడు అని చెప్పాలి. ఇక అలాంటి ఆటగాడిని మళ్ళీ వేలంలో సొంతం చేసుకోవాలని ప్లాన్ వేసాడు మహేంద్రసింగ్ ధోని.
కానీ ధోనికి మెగా వేలం లో ఊహించని షాక్ తగిలింది అని అర్థమవుతుంది. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని నిర్ణయించుకున్నా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇక మెగా వేలం లో స్టార్ ప్లేయర్స్ ను తీసుకుని జట్టును పటిష్టంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే డుప్లెసిస్ కోసం ఎంతగానో పోటీ జరిగగా.. చివరికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అతని దక్కించుకుంది. అతను రెండు కోట్ల కనీస ధర తో మెగా వేలంలో పాల్గొనగా.. అతని 7 కోట్లకు దక్కించుకుంది బెంగళూరు ఫ్రాంచైజీ. దీంతో అటు బెంగళూరు జట్టు పటిష్టంగా మారిపోయింది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి