ప్రస్తుతం టీమిండియా జట్టు శ్రీలంక తో టెస్టు సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ టెస్టు సిరీస్లో భాగంగా ఇటీవల మొహాలీ స్టేడియం వేదికగా ప్రారంభమైన మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. ఒక ఇన్నింగ్స్ తో పాటు 222 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక టీమిండియా అద్భుత విజయం తో ప్రస్తుతం మాజీ క్రికెటర్లు అందరూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే టీమిండియా ఇంత అద్భుత విజయం సాధించడంలోఅటు సీనియర్ ఆల్రౌండర్గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్ కూడా కారణం అని చెప్పాలి.


 శ్రీలంక బౌలర్ల తో ఒక ఆట ఆడుకున్న రవీంద్ర జడేజా 175 పరుగులతో అద్భుతమైన బ్యాటింగ్తో అదరగొట్టాడు. అదే సమయంలో బౌలింగ్ లో కూడా తన సత్తా చాటి తొమ్మిది వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇలా ఒకవైపు బ్యాటింగ్లో మరో వైపు బౌలింగులో కూడా అద్భుతంగా రాణించిన రవీంద్ర జడేజా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఏడో స్థానంలో బరిలోకి దిగి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు రవీంద్ర జడేజా. రవీంద్ర జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్ పై ప్రస్తుత మాజీ ఆటగాళ్లు అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.


 ఇలాంటి సమయంలో ఎప్పుడూ షాకింగ్ కామెంట్ చేసే మాజీ ప్లేయర్ గౌతం గంభీర్ ఈ విషయంపై స్పందించాడు. శ్రీలంకతో తొలి టెస్టులో రవీంద్ర జడేజా ప్రదర్శన అంత అత్యుత్తమమైనది ఏమీ కాదు అంటూ గంభీర్ చెప్పుకొచ్చాడు. కేవలం గణాంకాలు కారణంగానే అతడి ఇన్నింగ్స్ను అద్భుతమైనది గా భావిస్తున్నారు. విదేశాల్లోనూ అతడు ఇదే తరహా ఇన్నింగ్స్ ఆడితే మరింత కాన్ఫిడెన్సు పొందుతాడు. రవీంద్ర జడేజా సెంచరీ పూర్తి చేసిన తర్వాత శ్రీలంక స్పిన్నర్ల బౌలింగ్లో మరింత చెలరేగి ఆడాడు.. ఆస్ట్రేలియా లేదా ఇంగ్లాండ్ లో ఏడవ స్థానంలో బరిలోకి దిగి 40 లేదా 50 పరుగులు సాధించి ఉంటే ఈ ఇన్నింగ్స్ కంటే అత్యుత్తమమైనది అని చెప్పుకోవచ్చు అంటూ వ్యాఖ్యానించాడు. జడేజా అద్భుతమైన ఆల్రౌండర్ ఇందులో సందేహం లేదు.. కానీ ఇది మాత్రం అతడి బెస్ట్ ఇన్నింగ్స్ కాదు అంటూ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: