ముంబై ఇండియన్స్ జట్టులో ముఖ్యమైన బౌలర్గా కొనసాగుతున్న బుమ్రా ఎప్పుడు విజయాల్లో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అందుకే ఎంతో మంది యువ ఆటగాళ్లు జస్ప్రిత్ బుమ్రా తో కలిసి ఆడటానికి సరికొత్త అనుభవాలను సాధించడానికి ఇష్టపడుతుంటారు. ఇక్కడ ఒక ఇంగ్లాండ్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా తో కలిసి ఆడటం అదృష్టం అని చెబుతున్నాడు. ఇటీవల ట్రెంట్ బౌల్ట్ స్థానంలో మిల్స్ ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే స్పందించిన మిల్స్ జస్ప్రిత్ బూమ్రా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
జస్ప్రిత్ బూమ్రా తో కలిసి ఆడే అవకాశం రావడం నా అదృష్టం అంటూ చెబుతున్నాడు ఈ యువ ఆటగాడు. టి20 ప్రపంచ కప్ సమయంలో జస్ప్రిత్ బూమ్రా తో కొద్దిసేపు గడిపే సమయం వచ్చింది. ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టులో బుమ్రాతో కలిసి ఆడటానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. చాలా కాలం తర్వాత ఐపీఎల్లో ఆడబోతున్నా.. ఇక నాకు మళ్లీ ఆడే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు సదరు ఆటగాడు. ఇటీవలే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలు మిల్స్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మిల్స్ టి20 స్పెషలిస్టుగా మెయిల్స్ బాగా పేరు సంపాదించుకున్నాడు అనే చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి