ఈ క్రమం లోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టిక లో ఇక స్థానాన్ని మెరుగుపరచుకోవాలి అంటే మాత్రం తప్పనిసరిగా ప్రతి మ్యాచ్లో కూడా విజయం సాధించ వలసిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇటీవలే స్వదేశం తో టెస్ట్ సిరీస్ జరగగా.. ఈ టెస్టు సిరీస్లో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. మొదటి టెస్ట్ లో ఒక ఇన్నింగ్స్ తో పాటు 222 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఇక రెండవ టెస్ట్ మ్యాచ్లో కూడా అదే రీతిలో అద్భుతమైన విజయాన్ని సాధించింది అని చెప్పాలి
ఈ క్రమం లోనే వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టిక లో స్థానాలు మెరుగు పరుచుకున్న టీమిండియా అంతకు ముందు వరల్డ్ బెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో 5 వ స్థానం లో కొనసాగింది . ఇప్పుడు నాలుగవ స్థానానికి చేరుకుంది. ఇకపోతే ఇటీవల ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్ విడుదల చేయగా టీమిండియా 5వ స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరుకోవడం గమనార్హం. ఇక గత ఏడాది దక్షిణాఫ్రికా లో జరిగిన టెస్టు సిరీస్లో ఓటమి తర్వాత టీమిండియా ఇక ఇప్పుడు మంచి విజయం సాధించడం తో టీం ఇండియాకు ఉప శమనం కలిగించే అంశం అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి