ఐపీఎల్ ఛాంపియన్ జట్టు ముంబై ఇండియన్స్ నాలుగవ ఓటమిని చవిచూసింది. కనీసం నాలుగు మ్యాచ్ల్లో అయినా విజయం సాధించి ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో భోణి కొడుతుంది అనుకుంటే  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఓటమి పాలు కావడం గమనార్హం. దీంతో ఇప్పుడు ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. అయితే ఇటీవలే బెంగళూరులో జరిగిన మ్యాచ్లో కేవలం సూర్యకుమార్ యాదవ్ తప్ప మిగతా బ్యాట్స్మెన్లు అందరూ కూడా చేతులెత్తేశారు. ఓటమి అనంతరం మాట్లాడిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తమ జట్టు బ్యాటింగ్ వైఫల్యం గురించి చెప్పుకొచ్చాడు.


 తమ జట్టు బ్యాటింగ్ వైఫల్యమే జట్టు ఓటమికి కారణం అయింది అంటూ తెలిపాడు రోహిత్ శర్మ. వ్యక్తిగతంగా తన వైఫల్యం కూడా జట్టు విజయావకాశాలను పూర్తిగా దెబ్బ తీసింది అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వికెట్పై 150 పరుగుల టార్గెట్ ఏమాత్రం సరిపోదని చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.  వాస్తవానికి మేము బ్యాటింగ్ విభాగాన్ని పటిష్ట పరచాలి అని నిర్ణయం తీసుకున్నాము. దురదృష్టవశాత్తు కొంతమంది ఓవర్సీస్ ఆటగాళ్ల సేవలను కోల్పోయాము. ఇక అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్ల తోనే తమ జట్టు బరిలోకి దిగాము. సెన్సిబుల్  గా బ్యాటింగ్ చేస్తే చెలరేగ వచ్చు అని సూర్యకుమార్ యాదవ్ నిరూపించాడు. ఇక సూర్య కుమార్ బ్యాటింగ్ వల్లే కనీసం ప్రత్యర్థికి కొంత మంచి లక్ష్యాన్ని అందించగలిగాము. ఆ లక్ష్యం విజయవాడకి సరిపోదు అని తెలిసినప్పటికీ బంతితో మెరుగుపరచుకోవాలి అనుకున్నాం.


 కానీ రాయల్ చాలెంజర్స్ జట్టు బాగా బ్యాటింగ్ చేసింది. ఇక చాలా విషయాలలో మా బ్యాటర్లు మెరుగవ్వాలి.. ఎక్కువ సేపు ఆడేలా తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది  అంటూ చెప్పుకొచ్చాడు. బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పుడు 160, 150 పరుగుల టార్గెట్ అసలు సరిపోదు అంటూ రోహిత్ శర్మ  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: