ఐపీఎల్ లోకి కొత్తగా ఎంత ఇచ్చిన జట్లు వరుస విజయాలతో దూసుకుపోతూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంటే ఇప్పటికీ ఐపీఎల్ లో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించిన ముంబై ఇండియన్స్ మాత్రం వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది. దీంతో ఇక ముంబై పని అయిపోయినట్లే ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ప్లే ఆప్స్ కూడా కష్టమే అని అనుకుంటున్నారు అందరూ. అయితే ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో సతమతమవుతున్నప్పటికీ అటు జట్టులో కీలక బ్యాట్స్మెన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ మాత్రం అద్భుతమైన బ్యాటింగ్తో ప్రశంసలు అందుకుంటున్నాడు.
గాయం కారణంగా అటు ముంబై ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచ్లలో కి దూరమైన సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇచ్చి ఆడిన రెండు మ్యాచ్లలో కూడా హాఫ్ సెంచరీలతో మెరిశాడు. కానీ ముంబై ఇండియన్ కి మాత్రం ఓటమి తప్పలేదు అని చెప్పాలి. ఇకపోతే హాఫ్ సెంచరీలతో మెరిసిన ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ పై మాజీ ఆటగాడు రవి శాస్త్రి ప్రశంసలు కురిపించాడు. సూర్య కుమార్ యాదవ్ స్ట్రోక్ ప్లే నాణ్యంగా ఉంది. బెంగుళూరుతో మ్యాచ్ లో ఒక పక్క వికెట్లు పడుతుంటే చివరి వరకు క్రీజులో ఉండి పోరాడే లక్ష్యాన్ని సమకూర్చాడు. మ్యాచ్లో ఓడినప్పటికి అతని ఆటతీరు ఆకట్టుకుంది. అందుకే ముంబై ఇండియన్స్ ఆటగాళ్ళకు ఒకటే చెబుతున్న అందరూ సూర్య నమస్కార్ చేయండి అంటూ రవిశాస్త్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి