ఇలా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టింది అని చెప్పాలి. దీంతో అభిమానులు అందరూ కూడా ఎంతగానో సంతోషంలో మునిగిపోతున్నారు. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రస్తుతం మూడు మ్యాచ్ లలో గెలిచి సన్రైజర్స్ ఆరు పాయింట్లు సాధించింది. హైదరాబాద్ తో పాటూ బెంగళూరు, లక్నో, కోల్కతా, పంజాబ్, రాజస్థాన్ జట్లు కూడా 6 పాయింట్లతో ఉన్నాయి. కానీ సన్రైజర్స్ ఏడవ స్థానంలో కొనసాగుతుంది పాయింట్ల పట్టికలో. అయితే సన్రైజర్స్ వర్సెస్ విజయాలు సాధించడం ఆనందమే అయినప్పటికీ మెరుగైన రన్రేట్ లేకపోవడం మాత్రం పెద్ద దెబ్బే..
ఎందుకంటే మెరుగైన రన్రేట్ ఉన్నప్పుడే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సన్రైజర్స్ -0.196 రన్ రేట్ లో కొనసాగుతోంది. ఇక రానున్న మ్యాచ్ లో భారీ తేడాతో విజయం సాధించి రన్ రేట్ పై కూడా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సెమీఫైనల్ కు చేరాలి అంటే కొన్ని కొన్ని సార్లు కేవలం రన్ రేట్ తో మాత్రమే అవకాశం దక్కుతు ఉంటుంది. అందుకే రన్రేట్ మెరుగుపరుచుకుంటే ఇక హైదరాబాద్ కు తిరుగు ఉండదు అని చెప్పాలి. ఇక తర్వాత మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రాణించ బోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి