గత సీజన్ వరకు బెంగళూరు జట్టుకు కెప్టెన్గా కొనసాగిన విరాట్ కోహ్లీ టీమిండియాకు టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న అని ప్రకటించిన రోజే బెంగళూరు జట్టు కెప్టెన్గా కూడా తప్పుకున్నాడు  అన్న విషయం తెలిసిందే. ఇక కొత్త కెప్టెన్  ఎవరా అన్నదానిపై తీవ్రమైన చర్చ జరగగా డూప్లేసెస్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది ఆర్సిబి యాజమాన్యం. ఇక పోతే ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది బెంగళూరు జట్టు  కాగా ఇటీవలే బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుత సారథి డూప్లేసెస్ ని ఒక విచిత్రమైన కోరిక కోరాడు. ఇకపై ఆర్సిబి ఆడే ప్రతి మ్యాచ్లో కూడా తనను 30 గజాల సర్కిల్ లోనే ఉంచాలి అంటూ కోరాడు.



 ఇటీవలే ఢిల్లీ తో జరిగిన మ్యాచ్ లో 16 పరుగుల తేడాతో విజయం సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఈ క్రమంలోనే  విజయంతో మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో సంబరాలు చేసుకున్నారు ఆర్సిబి ఆటగాళ్లు. ఇక ఈ సమయంలోనే బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుత కెప్టెన్ డూప్లెసిస్ ను ఒక కోరిక కోరాడు. తనను సర్కిల్ లోపలే ఉంచాలి అంటూ అడిగాడు. ఇన్నింగ్స్ లో భాగంగా 16 ఓవర్లలో మహమ్మద్ సిరాజ్ వేసిన బంతిని సిక్సర్ కొట్టాలని భావించాడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్. ఈ క్రమంలోనే కోహ్లీ తల మీదుగా బంతి వెళ్తున్న సమయంలో అమాంతం గాల్లోకి ఎగిరిన విరాట్ కోహ్లీ ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.


 దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. ఇక రిషబ్ పంత్ ఔటయ్యాక ఢిల్లీ బ్యాటింగ్ విభాగం మొత్తం కుప్పకూలిపోయింది. అయితే ఇక విజయం తర్వాత సంబరాలలో కోహ్లీ మాట్లాడుతూ అందరం ఇదే సెంటిమెంట్ ఫాలో అవుదామని..  ప్రతి మ్యాచ్ లోనూ అక్కడే తనను ఫీల్డింగ్ పెట్టాలంటూ సరదాగా కోరాడు. ఇక ఇదే సమయంలో తన మిత్రుడు మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ని కూడా గుర్తు చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. అప్పట్లో డివిలియర్స్ ఒక్కడు మాత్రమే చేసే పని ఇప్పుడు జట్టులో ఇద్దరు ముగ్గురం కలిసి చేస్తున్నాము అంటు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: