ఆ తర్వాత ఏమైందో తెలియదు వరుసగా పేలవమైన ఫామ్ను కొనసాగిస్తూ ఉంది. ఇక ఇటీవలే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు పేలవమైన ప్రదర్శన చేస్తోంది. కోల్కతా జట్టు లో ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా అనుకున్న రీతిలో రాణించలేదు అని చెప్పాలి. దీంతో పేలవ ప్రదర్శన కారణంగా చివరికి చేతులెత్తేస్తుంది. దీంతో ఓటమి తప్పడం లేదు. కాగా ప్రస్తుతం ఇప్పుడు వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన కోల్కత నైట్రైడర్స్ జట్టు ఐదు విజయాలతో కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఇటీవలే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఒకసారి తమ జట్టు ఫామ్ లోకి వచ్చింది అంటే చాలు తిరుగు ఉండదు అంటూ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. తాము జట్టుగా నిలబడి ఆడితే తమను ipl-2020 2 సీజన్ లో ఏ జట్టు అడ్డుకోలేదు అంటూ విశ్వాసం వ్యక్తం చేశాడు. అలాగే ప్రతి మ్యాచ్లో కూడా గెలవాలన్న లక్ష్యంతోనే తాము బరిలోకి దిగుతాము అంటూ శ్రేయస్ అయ్యర్ తెలిపారు.. కానీ కొన్ని కొన్ని సార్లు అన్ని అనుకున్నట్లు జరగవు కదా అంటూ తెలిపాడు. మళ్లీ మునుపటి ఫామ్ లోకి వచ్చేందుకు తమ జట్టు ఎంతో కష్టపడుతుంది అంటూ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. కాగా ఏప్రిల్ 28 వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ఆడబోతుంది కోల్కతా నైట్ రైడర్స్ జట్టు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి