ఇలా బ్యాట్స్మెన్ భారీగా పరుగులు చేయాలనే లక్ష్యంతో క్రీజులోకి వచ్చిన సమయంలో అటు బౌలర్లు కట్టడి చేసేందుకు ఎంతో వైవిధ్యమైన బంతులు సందించాల్సి ఉంటుంది. అయితే ఇలా బ్యాట్స్మెన్లు ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ సిక్సర్లతో చెలరేగిపోయే టీ-20 ఫార్మెట్లో బ్యాట్స్మెన్లను కట్టడి చేయడం బౌలర్లకు పెద్ద సవాల్తో కూడుకున్నది. ముఖ్యంగా డాట్ బాల్స్ వేయడం అంటే చాలా అరుదుగానే జరుగుతూ ఉంటుంది. ఇక ఇలా ధనాధన్ పటపట అనే ఆటతీరు కేరాఫ్ అడ్రస్ అయిన ఐపీఎల్లో బౌలర్లు డాట్ బాల్స్ వేయడం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే..
ఎందుకంటే కనీసం బంతికి సింగిల్స్ అయిన తీయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు బ్యాట్స్ మెన్లు. అలాంటిది డాట్ బాల్స్ వేసి బ్యాట్స్మెన్ను కట్టడి చేసిన బౌలర్లు ఎవరో ఇప్పుడు కలుసుకుందాం. ఇప్పటివరకు సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అత్యధిక డాట్ బాల్స్ వేసి టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు ఇప్పటివరకు 1348 డాట్ బాల్స్ వేసాడు భువనేశ్వర్ కుమార్. ఆ తర్వాత 1331 డాట్ బాల్స్ తో సునీల్ నరైన్ రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ 1329 డాట్ బాల్స్ వేశాడు. హర్భజన్ సింగ్ 1268 డాట్ బాల్స్ వేసి 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. లసిత్ మలింగ 1155 డాట్ బాల్స్ తో ప్రస్తుతం 5వ స్థానంలో కొనసాగుతున్నాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి