అంతలా ప్రతి మ్యాచ్ కూడా ప్రేక్షకులను కన్ఫ్యూజన్లో పడేస్తుంది. ఎందుకంటే ఒక జట్టు గెలుస్తుందని అనుకుంటే మరో జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ విజయం సాధించటం జరుగుతూ ఉంది. కాగా నిన్న ఆదివారం ఇక రెండు మ్యాచ్ లని తెగ ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఇక నేడు కూడా సాయంత్రం ఏడున్నర గంటలకు జరగబోయే మ్యాచ్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. కాగా నేడు రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ క్రమంలోనే నేటి మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. కాగా ఇప్పటికే వరుసగా మూడు పరాజయాలతో కోల్కతా జట్టు అభిమానులను నిరాశ పరిచింది.
ఇప్పుడు ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించాలనే కసితో ఉంది. అదే సమయంలో అటు రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్ జోరు చూస్తే రాజస్థాన్ విజయం ఖాయం అనే లాగే కనిపిస్తుంది. దీంతో ఇక మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారుతుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. వాంఖడే స్టేడియం వేదికగా 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. గతంలో గణాంకాలు చూసుకుంటే ఇప్పుడు వరకు ఈ రెండు జట్లు ఫేస్ టు ఫేస్ తలపడిన సమయంలో కోల్కతా జట్టు 13 సార్లు, రాజస్థాన్ 12 సార్లు విజయం సాధించాయి. కాగా ఇక పాయింట్ల పట్టికలో చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ జట్టు మూడో స్థానంలో కోల్కతా నైట్రైడర్స్ జట్టు 8వ స్థానంలో కొనసాగుతున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి