ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్న ప్రతి ఆటగాడు కూడా ఫుల్ ఫామ్ లో కనిపిస్తున్నాడు. దీంతో బ్యాటింగ్ బౌలింగ్ ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అదరగొడుతుంది అని చెప్పాలి.. అయితే ప్రస్తుతం ప్లేఆఫ్ కి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇక రాజస్థాన్ రాయల్స్ మరింత మెరుగైన విజయాలు సాధించి ప్లే ఆఫ్ బెర్త్ సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు.


 ఇలాంటి సమయంలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక మైన హిట్టర్ గా కొనసాగుతున్న హిట్ మేయర్ రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడాడు అన్నది తెలుస్తుంది. ఇక వ్యక్తిగత కారణాల వల్ల హిట్మేయర్ బయో బబుల్ నుంచి బయటకు వచ్చి స్వదేశానికి వెళ్ళాడు అని తెలుస్తోంది. ఇటీవల హిట్మేయర్ భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పుత్రోత్సాహంతో ఎంతో ఆనందంలో ఉన్న హెట్మెయర్ తన బిడ్డను చూడాలని ఇక మేనేజ్మెంట్ను కోరగా వారు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఈ క్రమంలోనే జట్టు యాజమాన్యం పర్మిషన్ తో నే ఈరోజు ఉదయం స్వస్థలమైన గయానాకు బయల్దేరాడు అనేది తెలుస్తుంది.


 ఇటీవల ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. జీవితంలో పిల్లలు పుట్టే మధుర క్షణం ఒక్కసారే వస్తుంది. ఇప్పుడు నాకు అది కలిగింది. నా బిడ్డను చూడాలనే తాపత్రయం తో ఎమర్జెన్సీ పేరుతో స్వదేశానికి వెళ్తున్నాను. రాజస్థాన్ రాయల్స్ డ్రెస్సింగ్ రూమ్ లో నా జ్ఞాపకాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. నన్ను మిస్ అవుతున్నాను అని అనుకోవద్దు తొందరలోనే మళ్ళీ తిరిగి జట్టులోకి వస్తాను అంటూ హిట్మేయర్ చెప్పుకొచ్చాడు. అంచనాలకు మించి అద్భుతం గా రాణిస్తున్న హిట్మేయర్ కీలక సమయాల్లో క్రీజులోకి వచ్చి అదరకొడుతున్నాడు. 11 మ్యాచ్ లలో 291 పరుగులు సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl