ఐపీఎల్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈసారి ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. జట్టులోని ప్రతి ఆటగాడు కూడా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ప్లేఆఫ్ లో అడుగు పెట్టడానికి అడుగు దూరంలో ఉంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. అయితే గతంలో రాజస్థాన్ రాయల్స్ లో పవర్ హిట్టర్ గా పేరున్న హిట్మేయర్ కీలకంగా వ్యవహరించాడూ. సూపర్ ఫామ్ ఉన్నా హిట్ మేయర్ అదరగొట్టాడు. అయితే ఇటీవలే హిట్ మేయర్ తండ్రి అయ్యాడు అన్న విషయం తెలిసిందే.


 హిట్మేయర్ భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో తన కొడుకుని చూడడానికి వెళతానని పర్మిషన్  అడగడం తో అంగీకరించింది రాజస్థాన్ యాజమాన్యం. ఈ క్రమంలోనే ఇటీవల ఇంటికి వెళ్లి కొడుకును చూసాడు. ఈ క్రమంలోనే ఇటీవల మళ్లీ రాజస్థాన్ రాయల్స్ జట్టు తో చేరిపోయాడు అన్నది తెలుస్తుంది. కాగా మే 20వ తేదీన చెన్నై సూపర్ కిస్ తో రాజస్థాన్ రాయల్స్ ఆడబోయే మ్యాచ్ కి అందుబాటులో ఉంటాడు అని తెలుస్తుంది. బయో బబుల్ ఉన్న వీడి స్వదేశానికి వెళ్లిన హిట్మేయర్ ఇక ఇటీవల తిరిగి మళ్ళీ బయో బబుల్  లోకి వచ్చిచేరాడు.


 ఇక ఈ ఏడాది హెట్మెయర్ మంచి ప్రదర్శన చేస్తున్నాడు అని చెప్పాలి. ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లు ఆడిన ఈ స్టార్ ఆటగాడు 291 పరుగులు సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఫినిషర్ గా తన పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు వరకు 13 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ 8 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది  ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు మరో విజయం సాధించింది అంటే  ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోవడం ఖాయమన్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl