ఈ ఏడాది తన బ్యాటింగ్ తో ప్రేక్షకులందరినీ కూడా ఉర్రూతలూగించిన బ్యాట్స్మెన్ ఎవరు అంటే అందరూ చెప్పే పేరు జోస్ బట్లర్. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన తో అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాదు రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర వహించాడు. ఇక ఈ సీజన్ ప్రారంభంలో వరుసగా మూడు సెంచరీలతో అదరగొట్టాడు జోష్ బట్లర్. ఆ తర్వాత కాలంలో మాత్రం పెద్దగా ప్రదర్శన తో ఆకట్టుకోవాలని లేకపోయాడు అనే చెప్పాలి. తక్కువ పరుగులకే వికెట్ కోల్పోతూ నిలకడ లేని కారణంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే నేడు ఐపీఎల్ లో భాగంగా తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగబోతుంది.

 ఇక ఈ మ్యాచ్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ లో అడుగుపెడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్నో రోజుల తర్వాత తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడుతున్న రాజస్థాన్ ఎలాగైనా గెలవాలన్న కసితో ఉంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ గెలవాలంటే జోస్ బట్లర్ తప్పకుండా రానించాల్సిన   పరిస్థితి. బట్లర్ మరోసారి తన బ్యాట్ కి పని చెప్పాడు అంటే రాజస్థాన్ విజయం ఖాయం అయినట్లే అని అనుకుంటున్నారూ అభిమానులు.


 ఇదే విషయంపై జోస్ బట్లర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్లే ఆఫ్ లో కచ్చితంగా రాణిస్తా అంటూ చెప్పుకొచ్చాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జోస్ బట్లర్ టోర్నమెంట్ మొదటిభాగంలో నా ఫాంపై ఎంతగానో సంతోషంగా ఉన్నాను. కానీ గత కొన్ని మ్యాచ్ లలో మాత్రం నా ప్రదర్శనపై నిరాశ తోనే ఉన్నాను. అయితే ప్లే ఆఫ్ లో మాత్రం మళ్లీ పుంజుకుని మెరుగైన ప్రదర్శన చేస్తాను అంటూ జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు. కాగా నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు గుజరాత్ రాజస్థాన్ మధ్య తొలి క్వాలిఫైయర్ మ్యాచ్స్ జరగబోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: