ఇందులో నాలుగు సెంచరీలు నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచింది అంటే ఇక జోస్ బట్లర్ పోరాటానికి ఫలితం దక్కినట్లు అవుతుంది అని ఎంతోమంది అభిమానులు అనుకున్నారు. కానీ ఇక రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడంతో బట్లర్ పోరాటం వృథా అయిపోయింది అంటూ ఎంతో మంది నిరాశ చెందారు. అయితే ప్రేక్షకులు ఇంత నిరాశ చెందినప్పుడు ఏకంగా ఎంతో కష్టపడి పరుగులు చేసిన జోస్ బట్లర్ కి ఓటమి ఎంత భారంగా బాధ గా మారిపోయి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓటమి తర్వాత అటు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి జోస్ బట్లర్ వెక్కి వెక్కి ఏడ్చాడు అన్న విషయం తెలుస్తుంది. డ్రెస్సింగ్ లో రూమ్ లో రాజస్థాన్ కోచ్ కుమార సంగక్కర మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడూ బట్లర్. రవిచంద్రన్ అశ్విన్ సైతం ఓటమిని తట్టుకోలేక కంటతడి పెట్టాడు. ఈ క్రమంలోనే కెప్టెన్ సంజూ శాంసన్ ఇతర జట్టు సభ్యులు ఇక వీరిద్దరి ఓదార్చారు అని చెప్పాలి. ఆ తర్వాత స్పీచ్ ఇచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ అందరిలో ధైర్యాన్ని నింపారు. ఇక వచ్చే ఏడాది మరింత బలంగా పుంజుకునీ గెలిచేందుకు పోరాడుదాం అంటు అందరికీ పిలుపునిచ్చాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి