ఈ ఏడాది ఐపీఎల్ కారణం గా తక్కువ సమయం లోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్న బౌలర్ ఉమ్రాన్ మాలిక్. తన స్పీడ్ బౌలింగ్తో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. భారత క్రికెట్ లో సరికొత్త సంచలనం అంటు పేరు సంపాదించుకున్నాడు.  సెలెక్టర్ల చూపును కూడా ఆకర్షించి ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికా తో ఆడబోయే సిరీస్ లో కూడా అవకాశం దక్కించుకున్నాడు అన్నది తెలిసిందే. టీమిండియా లో  అవకాశం రావడం తో ఇటీవలే మాట్లాడిన ఉమ్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 జాతీయ జట్టుకు ఎంపిక కావాలి అన్న కల నెరవేరింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం అంటూ ఈ జమ్మూ కాశ్మీర్ ప్లేయర్ తెలిపాడు. గత ఏడాది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో నెట్ బౌలర్గా స్థానం సంపాదించుకున్న ఉమ్రాన్ మాలిక్ తర్వాత మాత్రం తుది జట్టు లో చోటు దక్కించుకుని అదరగొట్టాడు. ప్రతి మ్యాచ్లో కూడా 150 కిలో మీటర్లకు పైగా వేగం తో బంతులను విసురుతూ అదర గొట్టాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ప్రాక్టీస్ స్టేషన్లో తన మనసు లో మాట బయట పెట్టాడు.


 ఇక మొదటి మ్యాచ్లో తన ప్రదర్శన ఎలా ఉండ బోతుందో చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. భారత జట్టులో చోటు దక్కించూకోడానికి ముందు ఎంతో మంది అభిమానుల ప్రేమ ను గెలుచుకున్నా. అయితే సన్రైజర్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ డీయిల్ స్టేయిన్ నేను టీమిండియాను ఎంపిక అవుతాను అన్న విషయాన్ని అప్పుడే చెప్పారు. ఇక సన్రైజర్స్ టీమ్ బస్సులో ఉన్న సమయంలో ప్రతి ఒక్కరూ నాకు శుభాకాంక్షలు చెబుతుంటే.. ఆయన మాత్రం ఖచ్చితంగా టీమిండియాను ఎంపిక అవుతావని ఐపీఎల్ ప్రారంభానికి ముందే చెప్పాను కదా అంటూ సంతోషం వ్యక్తం చేశారు అని ఉమ్రాన్ మాలిక్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: