ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే టి20 వరల్డ్ కప్ కోసం అత్యుత్తమ జట్టు సిద్ధం చేసేందుకు అటు బీసీసీఐ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో ఎంతో మంది యువ ఆటగాళ్లకు కూడా అవకాశం కల్పిస్తోంది. ఐపీఎల్లో రాణించిన ఎంతో మంది యువ ఆటగాళ్లను ప్రస్తుతం సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో టీమిండియా ఆడుతున్న టి20 సిరీస్ లో సెలెక్ట్ చేసింది అన్న విషయం తెలిసిందే..


 ఇలాంటి సమయంలోనే ఈ ఏడాది ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన శిఖర్ ధావన్, సంజూ శాంసన్ సీనియర్లకు మాత్రం అటు చోటు కల్పించలేదు. బీసీసీఐ సెలెక్టర్స్ ఇక ఇటీవల ఇదే విషయం పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఐపీఎల్లో వరుసగా 500కు పైగా పరుగులు చేస్తూ ఆకట్టుకుంటున్న శిఖర్ధావన్ కొంతకాలం నుంచి టీమ్ ఇండియా టి 20 జట్టు లో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు. అతన్ని సెలెక్ట్ చేయకుండా  రాహుల్ ద్రావిడ్ అడ్డు పడ్డాడు అన్న వార్తలు కూడా వైరల్ గా మారిపోయాయ్.


 ఇదే విషయంపై స్పందించిన ఆకాశ్ చోప్రా టి20 వరల్డ్ కప్ లో శిఖర్ ధావన్ ను ఆడించాలని అనుకుంటూ సౌత్ఆఫ్రికా సిరీస్ ఎంపిక చేసే వాళ్ళు.. కానీ సెలెక్టర్లు మాత్రం అతని తీసి పక్కన పెట్టారు. ఎవరీ సెలెక్షన్ అయిన వారి పర్ఫామెన్స్ మీద ఆధారపడి  జరగాలి.. అదే న్యాయం అంటూ చెప్పుకొచ్చాడు. ధావన్ సెలక్షన్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. గత మూడేళ్లుగా ఐపీఎల్లో అద్భుతం రాణిస్తున్నాడు. అయినా అతని పట్టించుకోవడం లేదు. గత ఏడాది లంక పర్యటనలో భారత జట్టు శిఖర్ ధావన్ కెప్టెన్ గా ఉన్నాడు. అలాంటి ఆటగాడికి ఈ ఏడాది జట్టులో ప్లేస్ లేక పోవడం ఆశ్చర్యం గా ఉంది. ఒకవేళ టి 20 వరల్డ్ కప్ లో శిఖర్ ధావన్ నటించకూడదని అనుకున్నప్పటికీ సౌత్ఆఫ్రికా సిరీస్ లో ఆడిస్తే తప్పేంటి అంటూ వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కె.ఎల్.రాహుల్ లాంటి ఆటగాళ్లు దూరమైనప్పుడు శిఖర్ ధావన్ ను  ఆడించి ఉంటే బాగుండేది. అతనికి కెప్టెన్సీ ఇచ్చినా కూడా బాగుండేది అంటు అభిప్రాయం వ్యక్తం చేశాడు ఆకాష్ చోప్రా.

మరింత సమాచారం తెలుసుకోండి: