ఇటీవలి కాలంలో ఎంతో మంది ప్రపంచ రికార్డును సాధించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది వ్యక్తులు చేస్తున్న ప్రయత్నాలను అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి అని చెప్పాలి. ఇక కొంతమంది తమ ప్రాణాలను పణంగా పెట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గిన్నిస్ బుక్ లో రికార్డు సాధించడం అంటే అంత సులభమైన విషయమేమీ కాదు. ప్రపంచంలో ఉన్న వందల కోట్ల మంది కంటే మనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నప్పుడు మాత్రమే గిన్నిస్ బుక్ లో చోటు దగ్గుతూ  ఉంటుంది.


 అందుకే ఒక ప్రత్యేకమైన విషయం పై కొన్నేళ్ళ పాటు కఠోరమైన శిక్షణ తీసుకుని ఆ తర్వాత గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎంతో మంది. ఇలా ఇటీవలి కాలంలో కొంతమంది గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయ్. ఇటీవలే మరో వ్యక్తి గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకుని అతని పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగి పోయేలా చేశాడు.  ఇంతకీ గిన్నిస్ బుక్ లో రికార్డులు సాధించడానికి అతను ఏం చేశాడో తెలుసా మనకు అందరికీ తెలిసిన పుషప్స్ చేశాడు.


 అదేంటి పుషప్స్ చేస్తే గిన్నిస్ బుక్ రికార్డు వస్తుందా.. అలా అయితే మేము కూడా చేస్తాం అని అనుకుంటున్నారా.. అతడు చేసిన విధానం గురించి తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకుంటారు. ఏకంగా గంటలో 3182 పుష్ అప్స్  చేసి గిన్నిస్ బుక్ రికార్డును క్రియేట్ చేసాడు. ఆస్ట్రేలియా అథ్లెట్ డానియల్ స్కాలి. అయితే గతంలో గంటకి 3054 పుష్ అప్ తో రికార్డు కూడా ఇతని పేరిటే ఉండేది. ఇలా తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు డానియల్ స్కాలి. ఇందుకు సంబంధించి గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు మీడియా లో విషయాన్ని పంచుకున్నారు. కాగా డానియల్ స్కాలి ఇంతకు ముందు మరో రికార్డు కూడా నెలకొల్పాడు.  పురుషుల అబ్డామినల్ ప్లాంక్ లో 9 గంటల 30 నిమిషాలకు ఒక సెకండ్ పాటు ప్రదర్శన చేసి ఔరా అనిపించి గిన్నీస్ రికార్డు సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: