సాధారణంగా ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రికెటర్లు ఎప్పుడు అగ్రేసీవ్ గానే ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కొన్నిసార్లు తమకు తెలియకుండానే తప్పులు చేస్తూ ఉంటారు. కానీ ఏ తప్పు చేసిన గ్రహించేందుకు చుట్టూ కెమెరాలు.. పక్కనే అంపైర్  ఉంటాడు కదా. ఇక పొరపాటున చేసిన ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పుకు పనిష్మెంట్ మాత్రం ఇస్తూ ఉంటారు. ఇటీవలే వెస్టిండీస్ క్రికెటర్ కార్లోస్ బ్రాత్వైట్ విషయంలో కూడా ఇదే జరిగింది. బ్రాత్వైట్ బౌలింగ్ చేస్తున్న సమయంలో తన వైపుగా వచ్చినా బంతిని త్రో విసిరేందుకు ప్రయత్నం చేసాడు. ఈ క్రమంలోనే బంతి నేరుగా వెళ్లి బ్యాట్స్ మెన్ కాళ్ళకి తాకింది.


 ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగానే త్రో విసిరినట్లు రుజువు కావడంతో ఫీల్డ్ అంపైర్ వెంటనే 5 పరుగుల పెనాల్టీ విధిస్తు నిర్ణయం తీసుకున్నాడు. ఇది కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. విటాలిటీ టీ20 బ్లాస్ట్ లో భాగంగా వార్ విక్ షైర్,  డిర్బి షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భాగంగా డెర్బీ షేర్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 13 ఓవర్ లో బ్రాత్వైట్ బౌలింగ్ చేస్తున్నాడు.. ఈ క్రమంలోనే 34 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా  13 ఓవర్లో మూడు బంతిని యార్కర్  గా సంధించాడు. దీంతో బ్యాట్స్ మెన్ బంతిని ముందుకు త్రో చేశాడు. బంతి బ్రాత్వైట్ వైపు వెళ్లడంతో వెంటనే అందుకొని త్రో చేశాడు.


 ఈ క్రమంలోనే బంతి బ్యాట్స్ మెన్  పాదానికి గట్టిగా తగిలింది. తర్వాత మైదానంలో దూరంగా వెళ్ళింది. అయితే నాన్ స్ట్రైకర్ అదే సమయంలో పరుగు కోసం కాల్ చేయటంతో ఒక పరుగు పూర్తి చేశాడు. అయితే బ్రాత్వైట్ కూడా బ్యాట్స్ మెన్ ను క్షమాపణ కోరడం గమనార్హం. దీంతో ఇక్కడితో అంత ముగిసి పోయిందని  అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఫీల్డ్ అంపైర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.. ఉద్దేశపూర్వకంగానే బ్రాత్ వైట్ త్రో విసిరాడు అని భావించి శిక్షగా  5 పరుగులు పెనాల్టీ విధించారు.. లెగ్ అంపైర్ తో చర్చించాక బంతిని డెడ్ బాల్ గా పరిగనిస్తు నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: