భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంగ్లాండ్ భారత్ మధ్య టెస్ట్ మ్యాచ్ నేటి నుంచి ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. కాగా రోహిత్ శర్మ కరొనా వైరస్ బారినపడి జట్టుకు దూరం కావడంతో ప్రస్తుతం జస్ప్రిత్ బూమ్రా కెప్టెన్సీలో బరిలోకి దిగబోతోంది టీమిండియా. ఇక ఎన్నో ఏళ్ల తర్వాత ఒక ఫాస్ట్ బౌలర్ టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్సీ చేపడుతున్న నేపథ్యంలో ఇండియా ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.


 అయితే ప్రస్తుతం ఇక ఇంగ్లాండ్ భారత్ మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ విషయంలో ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో ఇంగ్లాండ్ వెటరన్ ఆల్ రౌండర్  మొయిన్ అలీ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఇటీవలే న్యూజీలాండ్ జట్టుపై అధిపత్యాన్ని చెలాయించి  3-0 తో క్లీన్ స్వీప్ చేసి ఎంతగానో ఆత్మ విశ్వాసంతో ఉన్న ఇంగ్లాండ్ ను ప్రస్తుత పరిస్థితుల్లో ఆపడం ఎంతో కష్టం అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. గత ఏడాది ఈ మ్యాచ్ పూర్తి అయి ఉంటే అప్పుడు జోరు మీద ఉన్న టీమ్ ఇండియా కు అనుకూలంగానే ఫలితం ఉండేది. కానీ ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు ఏకంగా లోడ్ చేసిన గన్ లా కనిపిస్తుంది. ఇక ఇంగ్లాండ్ జట్టుకు ఎదురుపడిన వారు ఎంతటి వారైనా సరే ఫెయిల్ అవుతారు అంటూ హెచ్చరించాడు మొయిన్ అలీ.


 ప్రస్తుతం ఇండియా జట్టుకు కీలక ఆటగాళ్లు అయినా రోహిత్ శర్మ కె.ఎల్.రాహుల్ లాంటి స్టార్ ప్లేయర్స్ సేవలు అందుబాటులో లేకపోవడం మరింత మైనస్ గా మారిపోయింది అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతేకాదు గత ఏడాదితో పోల్చి చూస్తే ఇంగ్లాండు ఆటగాళ్ల మైండ్సెట్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టు ఎదురు దాడిని ప్రధాన అస్త్రంగా వినియోగిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మొత్తంగా నేడు జరగబోయే టెస్ట్ లో తన ఫేవరెట్ ఇంగ్లాండ్ జట్టే అంటూ జోస్యం చెప్పాడు. మరికొంతమంది క్రికెటర్లు కూడా ఈ మ్యాచ్ పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: