ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయి నిరాశపర్చిన టీమిండియా జట్టు టి-20 సిరీస్ గెలుచుకుని  అందరిలో ఉత్సాహాన్ని నింపింది అన్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా జట్టు ఇంగ్లాండ్ జట్టుకు వరుసగా రెండు మ్యాచ్లలో ఊహించని షాక్ ఇచ్చింది. వరుస విజయాలతో ఎంతో ఆత్మ విశ్వాసంతో ఉన్న ఇంగ్లాండ్ జట్టును ఓటమితో దెబ్బతీసింది. మొదటి టీ20 మ్యాచ్ లో 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది టి20 మ్యాచ్ లో కూడా అదే జోరు కొనసాగించి విజయం అందుకుంది. సిరీస్ కైవసం చేసుకుంది.


 ఇక మూడో మ్యాచ్లో మాత్రం అటు ఇంగ్లండ్ జట్టు పుంజుకోవడంతో టీమ్ ఇండియాకు ఓటమి తప్పలేదు. ఇదిలా ఉంటే నేటి నుంచి ఇక ఇంగ్లాండ్ టీమిండియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ వన్డే సిరీస్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.  టి 20 సిరీస్ గెలిచిన జోష్ లో  ఇప్పుడు మూడు వన్డేల సిరీస్కు సిద్ధమైంది టీమిండియా. ఇక తొలి వన్డే మ్యాచ్ నేడు సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభం కాబోతుంది. సోనీ నెట్వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం కాబోతుంది అన్నది తెలుస్తుంది.


 ఈ క్రమంలోనే తొలి మ్యాచ్లోనే విజయం సాధించి ఆధిక్యాన్ని కొనసాగించాలని రోహిత్ భావిస్తుండగా.. టీ20 సిరీస్ ఓడిపోయి ఇక ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్న ఇంగ్లండ్ జట్టు మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంది. అంతే కాదు  ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన జోస్ బట్లర్ కూడా తన కెప్టెన్సీని మార్కు చూపించాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు.  దీంతో ఇక అటు వన్డే సిరీస్ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది అన్నది మాత్రం తెలుస్తోంది. ఇక నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు గెలవబోతున్నారో అన్నది కూడా ఆసక్తికరంగా మారింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: