గత కొంత కాలం నుంచి టీమిండియాకు దూరమైన స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్  ఇక ఇటీవల ఇంగ్లాండ్  పర్యటనలో భాగంగా టీమిండియా ఆడుతున్నా వన్డే సిరీస్ లో  జట్టులో అవకాశం దక్కించుకున్నాడు అనే విషయం తెలిసిందే. అయితే ఇక మెరుగైన ప్రదర్శన తో మొదటి మ్యాచ్ లో ఆకట్టుకొన్నాడు శిఖర్ ధావన్. అయితే మొదటి వన్డే మ్యాచ్లో బరిలోకి దిగిన శిఖర్ ధావన్ రోహిత్ శర్మ జోడి ఎప్పుడు ప్రేక్షకులకు ఫేవరెట్ గానే ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ ఇద్దరి ఓపెనింగ్ జోడి ఇప్పటివరకు ఎన్నో సార్లు టీమిండియాకు అరుదైన విజయాలను అందించింది.


 ఒకరు  విఫలమైన మరొకరు బాగా రాణిస్తూ ఇక టీమిండియాకు మంచి ఆరంభం అందిస్తూ ఉంటారు. అంతేకాదు ఇక ఈ ఇద్దరి ఓపెనర్ల మధ్య టు కోఆర్డినేషన్ కూడా ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది అని చెప్పాలి. ఇక ఇద్దరు ఓపెనింగ్ జోడీ కూడా ఇప్పటివరకు వన్డేలో రికార్డు స్థాయి పరుగులు చేసి అదరగొట్టారు. ఇక ఇప్పటికే ఎన్నోసార్లు తమది బెస్ట్ ఓపెనింగ్ జోడి అని నిరూపించుకున్నారు శిఖర్ ధావన్,రోహిత్ శర్మ. ఇక ఇటీవల ఇంగ్లాండ్లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో కూడా అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకున్నారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉన్న నేపథ్యంలో  వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడుతూ అదరగొట్టారు.


 ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నారు. ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో ఈ ఓపెనింగ్ జోడి ఆరు పరుగులు చేయడంతో షాకింగ్ రికార్డు వీరి ఖాతాలో చేరిపోయింది. 112 మ్యాచ్ లో 5000 రన్స్ పూర్తి చేసుకున్న ఓపెనింగ్ జోడి గా రికార్డు సృష్టించింది. అయితే ఇలా ఐదు వేల పరుగులు పూర్తి చేసుకున్న ఓపెన్ జోడి భారత క్రికెట్లో వీరిది రెండవది కావడం గమనార్హం. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ ఓపెనింగ్ జోడి ఇక ఈ రికార్డు సాధించింది. మొత్తం 136 వన్డేల్లో 6699 పరుగులు చేసింది ఈ జోడి.

మరింత సమాచారం తెలుసుకోండి: