ఇటీవల కాలంలో విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ లో కొనసాగుతూ రోజురోజుకీ టీమిండియాకు భారంగా మారిపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. అత్యుత్తమ ప్లేయర్ కావడంతో ఇప్పటి వరకు ఎవ్వరికీ ఇవ్వనన్ని అవకాశాలు అటు విరాట్ కోహ్లీకి ఇస్తుంది బీసీసీఐ. అయినప్పటికీ అతను మాత్రం మళ్లీ మునుపటి ఫామ్ అందుకోలేక పోతున్నాడు అన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే అతని పేలవ ప్రదర్శన పై విమర్శలు చేస్తున్న మాజీ ఆటగాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది అని చెప్పాలి. ఇక ఇటీవలే విరాట్ కోహ్లీ  ఫాంపై.. అతని ఇంకా జట్టులో కొనసాగించడంపై పాకిస్థాన్ మాజీ స్పీకర్ డానిష్ కనేరియా స్పందిస్తూ ఘాటుగానే వ్యాఖ్యలు చేశాడు.


 ఇటీవల కాలంలో  టీమిండియా తరఫున ఎంతో మంది యువ ఆటగాళ్లు రాణిస్తున్న సమయంలో వారికి వరుసగా అవకాశాలు ఇవ్వకుండా ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీని జట్టుతో పాటు ఎన్ని రోజుల పాటు కొనసాగిస్తారని ప్రశ్నించాడు. వరల్డ్ క్లాస్ ఆఫ్ స్పిన్నర్ అయిన అశ్విన్ను తప్పించి నప్పుడు.. విరాట్ కోహ్లీని ఎందుకు తప్పించరు. దీపక్ హుడా లాంటి ప్రతిభావంతులైన యువ క్రికెటర్ల కెరియర్ తో సెలక్షన్ కమిటీ జట్టు మేనేజ్మెంట్ ఎందుకు ఆట ఆడుతోంది. ఇండియన్ టీం ఇండియా అభిమానులతో ఇంతకీ ఎవరు లుడో గేమ్ ఆడుతున్నారు. అర్షదీప్, దీపక్ హుడా అలాంటి ప్లేయర్లు రానున్న రోజుల్లో భారత క్రికెట్లో వెన్నుముకగా మారుతారు..


 సూర్యకుమార్ యాదవ్ కూడా ఎంతో నమ్మకమైన ప్లేయర్ అంటూ డానిష్ కనేరియా వ్యాఖ్యానించాడు. ఇక విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావడానికి అతనికి విశ్రాంతిని ఇస్తూ ఆడిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్ని రోజులు విశ్రాంతి ఇచ్చిన.. ఎన్ని అవకాశాలు ఇచ్చినా విరాట్ కోహ్లీ మాత్రం మళ్ళీ ఫామ్ అందుకోవడం లేదు. దీంతో ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా విరాట్ కోహ్లీని తప్పించి అతని స్థానంలో యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని సూచిస్తూ ఉండటం గమనార్హం. మరి రానున్న రోజుల్లో బీసిసిఐ ఏం చేయబోతుంది అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: