భారత జట్టులోకి ధోని వారసుడు అనే ఒక ట్యాగ్ తో ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ ప్రస్తుతం తన ప్రదర్శన తో ఆకట్టుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఫార్మాట్ తో సంబంధం లేకుండా  మెరుగైన ప్రదర్శన చేస్తూ టీమిండియా విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలో అదరగొట్టిన రిషబ్ పంత్ ఇక ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనలో కూడా తనకు తిరుగు లేదు అని  నిరూపించాడు చెప్పాలి. అంతేకాదు ఎన్నో రికార్డులను కూడా కొల్లగొడుతూ అభిమానులందరినీ కూడా సర్ప్రైజ్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఇటీవలే వెస్టిండీస్ వేదికగా జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు.


 చేసింది 14 పరుగుల అయినప్పటికీ అరుదైన రికార్డును మాత్రం ఖాతాలో వేసుకున్నాడు రిషబ్ పంత్. ఈ ఏడాది టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాట్స్మెన్గా రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు వరకూ 988 పరుగులతో ఉన్నాడు రిషబ్ పంత్.  ఇక ఇటీవల తొలి టీ-20 మ్యాచ్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన 12 బంతుల్లో 14 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. అయితే తక్కువ పరుగులతో వికెట్లు కోల్పోయినప్పటికీ అరుదైన రికార్డును మాత్రం అందుకున్నాడు.


 ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు రిషబ్ పంత్.  ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా సెంచరీతో అదరగొట్టిన రిషబ్ పంత్ ఇటీవల ఇంగ్లాండ్ లో ముగిసిన 3వ నెలలో కూడా సెంచరీ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా మూడు ఫార్మాట్లలో ఈ ఏడాది ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో భారత్ నుంచి శ్రేయస్ అయ్యర్ రెండవ స్థానంలో ఉన్నాడు. 23 ఇన్నింగ్స్ లో 866 పరుగులు చేశాడు శ్రేయస్ అయ్యర్. వన్డే సిరీస్ విజయం జోరును కొనసాగిస్తూ మొదటి టి20 మ్యాచ్ లో కూడా టీమిండియా విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: