గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ పరస వైఫల్యాలతో తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. దాదాపు గత రెండేళ్ల నుంచి విరాట్ కోహ్లీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడటం లేదు అని చెప్పాలి. విరాట్ కోహ్లీ సెంచరీకి కూడా దూరం అయిపోయాడు. ఈ క్రమంలోనే అతని తీరుపై  ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారూ.  అయితే కొన్నాళ్లు విశ్రాంతి తర్వాత మళ్లీ యూఏఈ వేదికగా జరగబోయే ఆసియా కప్ లో విరాట్ కోహ్లీ అవకాశం దక్కించుకున్నాడు. దీంతో టీమిండియా లో ఉన్న మిగతా ఆటగాళ్లు అందరూ ఎలా రాణిస్తారు అన్న దానికంటే.. కోహ్లీ ఎలా రాణించ పోతున్నాడు అన్నది ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.


 కాగా ఇటీవల ఇదే విషయంపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు అకిబ్ జావేద్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  కోహ్లీ తన బ్యాటింగ్ తీరును మార్చుకుని మళ్లీ ఫామ్ లోకి వస్తే తాను మ్యాచ్లు చూస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోహ్లీ కనుక ఆత్మవిశ్వాసంతో లేకపోతే పాకిస్థాన్ చేతిలో భారత ఓడిపోతుందని షాకింగ్ కామెంట్స్ చేశాడు జావేద్. ఆసియా కప్ లో కూడా కోహ్లీ పరుగులు చేయకపోతే.. అతని ఇంకా ఎందుకు ఆడిస్తున్నారు అన్న ప్రశ్నలు కూడా తెరమీదికి వస్తాయి అంటూ చెప్పుకొచ్చాడు.


 ఇక ఫామ్ లో ఉన్న దీపక్ హుడా ను ఎందుకు పక్కన పెట్టారు అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతాయి అంటూ వ్యాఖ్యానించాడు. అయితే యూఏఈ లో ఉండే పిచ్ లు బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి కోహ్లీ ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది అంటూ తెలిపాడు. కాగా మరికొన్ని రోజుల్లో యూఏఈ వేదికగా ఆసియాకప్ జరగబోతుంది. ఈనెల 28వ తేదీన దాయాదుల పోరు జరగబోతుంది.  ఆసియా కప్లో భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ లో ఎవరు పైచేయి సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: