మొదటి మ్యాచ్ లో టీమిండియా ఘన విజయాన్ని అందుకోగా ఇక రెండో మ్యాచ్లో మాత్రం అటు జింబాబ్వే జట్టు కాస్త పుంజుకొని మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో జింబాంబ్వే బ్యాటింగ్ విభాగం మరింత విఫలం అయింది. 38.1 ఓవర్లలో 161 పరుగులు చేసి చివరికి చేతులెత్తేసింది జింబాబ్వే బ్యాటింగ్ విభాగం. ఇక ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు 25.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది అని చెప్పాలి. మొత్తంగా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి చివరికి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది.
అయితే ఇక రెండో వన్డేలో ఓటమి తర్వాత జింబాబ్వే కెప్టెన్ రేగిస్ చకబ్వా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే భారత జట్టుతో రెండో వన్డే మ్యాచ్ లో ఓడిపోయాము అంటూ చెప్పుకొచ్చాడు. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది అంటూ చెబుతున్నాడు. అయితే ఈ మ్యాచ్లో మేము గట్టిపోటీని ఇచ్చాము. గత కొన్ని మ్యాచ్ లలో ఆరంభంలో వికెట్లు తీయడంలో మేము తడబడ్డాము. కానీ ఈ మ్యాచ్లో ఆ సమస్యను అధిగమించాము. కానీ బ్యాటింగ్లో కొన్ని పరుగులు చేయాల్సి ఉంది. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. సరైన ప్రదేశాల్లో బంతిని వేసి వికెట్లు రాబట్టారు అంటూ జింబాబ్వే కెప్టెన్ చెకబ్వా చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి