క్రికెట్ లో ఎంత టాలెంట్ ఉన్నా కొన్ని కొన్ని సార్లు అదృష్టమే అవకాశాలను నిర్ణయిస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు కొంత మంది విశ్లేషకులు.  అయితే కొంత మంది ఆటగాళ్ల విషయం లో జరిగే విషయాలు చూస్తూ ఉంటే ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచినప్పటికీ వస్తుంది అనుకున్న అవకాశం చేజారి పోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ ఫేసర్ మహమ్మద్ సిరాజ్ విషయం  లో కూడా ఇదే జరిగింది అన్నది తెలుస్తుంది. ఇటీవల సౌత్ ఆఫ్రికా తో ముగిసిన 300 సిరీస్ లో మంచి ప్రదర్శన కనబరిచాడు మహమ్మద్ సిరాజ్.


 ఈ క్రమం లోనే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా కూడా అవార్డును దక్కించుకున్నాడు. అయినప్పటికీ అతనికి నిరాశ ఎదురయింది. మొన్నటికి మొన్న గాయం కారణం గా టి20 వరల్డ్ కప్ కు దూరమైనా బుమ్రా స్థానంలో రీప్లేస్మెంట్గా జట్టులోకి వచ్చిన సిరాజ్ ప్రపంచ కప్ జట్టులో మాత్రం అతనికి ప్రత్యామ్నాయంగా ఎంపిక కాలేకపోయాడు.  గాయం కారణంగా బుమ్రా దూరం అవడంతో హుటాహుటిన ఇంగ్లాండు కౌంటి క్రికెట్ ఆడుతున్న సిరాజును రప్పించింది టీమిండియా మేనేజ్మెంట్. అదే సమయంలో మరో సీనియర్ మహమ్మద్ షమి కరోనా వైరస్ బారిన పడడం అతనికి బాగా కలిసి వచ్చింది.


 అయితే సౌత్ ఆఫ్రికా తో వన్డే సిరీస్ లో మంచి ప్రదర్శన చేస్తే టి20 వరల్డ్ కప్ లో చోటు దక్కుతుందని అందరు అనుకున్నారు. అనుకున్నట్లుగానే మహమ్మద్ సిరాజ్ మంచి ప్రదర్శనతో ఆకట్టుకుని మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా దక్కించుకున్నాడు.  కానీ ఇదంతా జరిగే లోపే మహమ్మద్ షమీ ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేయడంతో సిరాజ్ ఆశలని అడియాశలయ్యాయి. బుమ్రా స్థానంలో షమి జట్టులోకి వెళ్ళినట్లు తెలుస్తుంది.  అయితే సిరాజ్ స్టాండ్ బై ప్లేయర్గా  ఆస్ట్రేలియా వెళ్ళబోతున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: