ఇలాంటి సమయం లోనే మరో ప్రచారం తెర మీదకి వచ్చింది. బీసీసీఐ అధ్యక్షుడిగా మరోసారి కొనసాగాలని భావించిన సౌరబ్ గంగూలీకి నిరాశ ఎదురయింది అంటూ ప్రచారం మొదలైంది. బిసిసిఐ పెద్దలు సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ నియంత్రణ మండలీ అధ్యక్షుడుగా ఉండేందుకు అంగీకరించలేదని.. ఈ క్రమంలోనె అతను పదవి నుంచి తప్పుకుంటున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారిపోయాయి. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఇదే విషయంపై స్పందించాడు గంగూలీ.
ఏ పదవిలో అయినా సరే జీవిత కాలం కొనసాగడం కుదరదు అని.. ఏదో ఒక రోజు బాధ్యతల నుండి తప్పుకోవాల్సిందే అంటూ చెప్పుకొచ్చాడు. ఆటగాడిగా కెప్టెన్గా అధ్యక్షుడిగా ఇప్పటికే అన్ని పదవులను చేపట్టాను. ఇక రానున్న రోజుల్లో మరింత అత్యున్నతమైన పదవిని చేపడుతాను అంటూ తెలిపాడు. బీసీసీఐ అధ్యక్ష పదవి తర్వాత అత్యున్నతమైన పదవి అంటే అటు ఐసిసి చైర్మన్ పదవి కావడం గమనార్హం. దీంతో అత్యున్నత పదవి అంటూ సౌరబ్ గంగూలీ వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు అన్న ప్రచారం మొదలైంది. మరి ఏం జరగబోతుంది అన్నది రానున్న రోజుల్లో తెలియనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి