2023 ఐపీఎల్ సీజన్లో టైటిల్ కొట్టడమే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న పంజాబ్ కింగ్స్ జట్టు యాజమాన్యం ఇక ఆటగాళ్ల విషయంలోనే కాదు అటు కోచింగ్ సిబ్బంది విషయంలో కూడా అనూహ్యమైన మార్పులను తీసుకువస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల పంజాబీ కింగ్స్ బ్యాటింగ్ కోచ్గా ఏకంగా భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ ను నియమిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. కాగా వసీం జాఫర్ ను బ్యాటింగ్ కోచ్ గా నియమించడం మంచి నిర్ణయం అంటూ ఎంతో మంది అభిమానులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


 ఇలాంటి సమయంలో అటు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ మాత్రం వసీం జాఫర్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగానే వసీం జాఫర్  మైఖేల్వాన్ మధ్య ట్విటర్ వేదికగా ఎప్పుడు  వార్ నడుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  ఇద్దరూ ఒకరికి ఒకరు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల వసీం జాఫర్ ఏకంగా పంజాబ్ కింగ్స్ జట్టుకి బ్యాటింగ్ కోచ్గా ఎంపిక కావడంపై సెటైరికల్ గా స్పందించాడు మైకల్ వాన్. ఇక అతను చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి.



 ఎవరినైతే నేను అవుట్ చేశానో వారు ఇప్పుడు బ్యాటింగ్ కోచ్ అంటూ మైకల్ వాన్ సెటైరికల్ గా ఒక కామెంట్ చేశాడు. అయితే ఈ కామెంట్ చూడగానే మీకు ఒక డౌట్ వచ్చి ఉండవచ్చు. అదేంటి మైకల్ వాన్ బ్యాట్స్మెన్ కదా. మరి బౌలింగ్ చేసి వికెట్ పడగొట్టడం ఏంటి అనే అనుమానం రావచ్చు. అయితే అప్పుడప్పుడు మైకల్ వాన్ బౌలింగ్ కూడా చేసేవాడు. ఇలా తొలిసారి టెస్ట్ క్రికెట్లో బౌలింగ్ చేసిన సమయంలో మైకల్  వాన్ వసీం జాఫర్ వికెట్ను తీశాడు. దీంతో దానిని గుర్తు చేసుకుంటూ  నేను టెస్టుల్లో బౌలింగ్ చేసినప్పుడు జాఫర్ వికెట్ తీశాను. కానీ ఇప్పుడు అతనే బ్యాటింగ్ కోచ్ గా మారిపోయాడు అంటూ కామెంట్ చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: