టీమిండియా యువ ఆటగాడు సంజూ శాంసన్ ఇటీవల కాలంలో రోజురోజుకీ హీరోగా మారిపోతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఒకవైపు సంజూ శాంసన్ బాగా రాణిస్తూ ఉన్నప్పటికీ టీం ఇండియా యాజమాన్యం మాత్రం అతనిపై వివక్ష చూపుతుంది అంటూ గత కొంతకాలం నుంచి అతను వార్తలు నిలుస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్నాళ్లపాటు భారత క్రికెట్ ప్రేక్షకులు ఇది కేవలం పుకార్లు మాత్రమే అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత కాలంలో సంజు శాంసన్ విషయంలో టీమ్ ఇండియా యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు చూసి నిజంగానే అతనికి అన్యాయం జరుగుతుంది అంటూ సోషల్ మీడియా వేదిక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


 టీమిండియా యాజమాన్య వివక్షపూరితంగా వ్యవహరిస్తుంది అంటూ బహిరంగ విమర్శలు చేస్తూ నిరసనలు చేస్తూ ఉండడం కూడా కనిపించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్ ప్రేక్షకులందరూ అతనికి మద్దతు ప్రకటిస్తూ అభిమానించడం మొదలుపెడుతున్నారు. తద్వారా సంజూ శాంసన్ క్రేజ్ అంతకు అంతకు పెరిగిపోతూనే ఉంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఏకంగా దేశం దాటి ఇతర దేశాలకు కూడా సంజూ శాంసన్ క్రేజ్ పాటిపోయింది అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం ఖాతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో మొన్నటికి మొన్న ధోని జెర్సీతో కొంతమంది భారత క్రికెట్ అభిమానులు అలరించారు. ఇక ఇటీవల ఏకంగా సంజూ శాంసన్ ఫోటోతో ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్లో అభిమానులు సందడి చేశారు. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.  ఏకంగా సంజు శాంసన్ పోస్టర్ను పట్టుకొని సపోర్ట్ చేస్తున్నట్లు ఒక బ్యానర్ తో ఫోటో దిగాడు వ్యక్తి. ఇక ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అని చెప్పాలి. ఇది చూసిన సంజూ శాంసన్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. సంజు శాంసన్ పై ఉన్న అభిమానం  ఇప్పుడు దేశం దాటేసింది అంటు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: