ప్రస్తుతం భారత క్రికెట్ టీం లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరు అయినటువంటి రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా టీం ఇండియా క్రికెట్ అభిమానులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవీంద్ర జడేజా టీం ఇండియాలో అత్యుత్తమైన ఆల్ రౌండర్ గా పేరును తెచ్చుకున్నాడు. ఇప్పటికే రవీంద్ర జడేజా ఎన్నో మ్యాచ్ లలో తన అద్భుతమైన బ్యాటింగ్ తో ... బౌలింగ్ తో ... బిల్డింగ్ తో ఇండియాకు అనేక విజయాలను అందించాడు. అలాగే రవీంద్ర జడేజా ఇప్పటికే ఎన్నో టి 20 , వన్డే , టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లలో అత్యద్భుతమైన ఆల్ రౌండర్ ప్రదర్శనను కనబరిచి ఎంతో మంది క్రికెట్ అభిమానుల మనసు కూడా దోచుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా టీం ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించు కున్నాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న స్టార్ ప్లేయర్ జడేజా అందుకు సంబంధించిన ఒక ఫోటోను కూడా తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటో నేటింట అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా  తాజాగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసింది.  ఎమ్మెల్యే అభ్యర్థిగా బిజెపి పార్టీ తరుపు నుండి  రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా పోటీ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆమె కూడా తన ఓటు హక్కును రాజ్ కోట్ నియోజకవర్గంలో తాజాగా ఉపయోగించుకుంది. రివాభా జడేజా కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: