టీ20 వరల్డ్ కప్ 2022 గెలిచిన తర్వాత ఇంగ్లాండ్ ఆటలో మరింత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. తాజాగా ఇంగ్లాండ్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్యన రెండు టెస్ట్ ల సిరీస్ ను ఆడనున్నారు. అయిదు రోజుల నుండి జరుగుతున్న మొదటి టెస్ట్ లో హోరా హోరీ పోటీ తర్వాత చివరిగా ఇంగ్లాండ్ విజయాన్ని అందుకుంది. మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ను ఎంచుకుని, మొదటి ఇన్నింగ్స్ లో మెరుపు బ్యాటింగ్ ఆడగా 657 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్ లో మొత్తం నాలుగు ఇంగ్లాండ్ ఆటగాళ్లు క్రాలీ, డక్కెట్, పోప్ మరియు బ్రూక్ లు సెంచరీలు సాధించారు.

అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడిన పాకిస్తాన్... ఇంగ్లాండ్ కు ధీటుగా సమాధానం ఇచ్చి పరుగులకు 579 ఆల్ అవుట్ అయింది. షఫీక్ , ఇమామ్ఉల్ హాక్ మరియు అజామ్ లు సెంచరీలు సాధించారు. రెండవ ఇన్నింగ్స్ ను ఇంగ్లాండ్ 78 పరుగుల స్వల్ప ఆధిక్యంతో ప్రారంభించగా, కేవలం 7 వికెట్లకు 264 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశారు. దీనితో 342 పరుగుల భారీ లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ ను కొనసాగించిన పాకిస్తాన్ ఏ దశలోనూ మ్యాచ్ ను గెలుచుకోవడానికి ప్రయత్నించలేదు. డిఫెన్స్ మోడ్ లోనే ఆడుతున్న పాకిస్తాన్ ను ఇంగ్లాండ్ క్రమంగా వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచుతూ వచ్చింది.

ఆఖరి రోజుకు వచ్చే సరికి ఓవర్ కు 3 పరుగులు చేస్తే గెలుస్తుంది అనుకుంటున్న సమయంలో వికెట్లను కాపాడుకోలేక మ్యాచ్ ను పోగొట్టుకుంది. అయితే ఇంగ్లాండ్ మాత్రం ఏ దశలోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకపోవడం గమనార్హం. ఇక పాకిస్తాన్ అభిమానులు అయితే గెలవడం కష్టం కానీ డ్రా అయినా చేసుకుంటుంది అని భావించారు. అయితే పాక్ అభిమానుల ఆశలను నీరుగారుస్తూ లక్ష్యానికి 74 పరుగుల దూరంలో ఆగిపోయి మ్యాచ్ ను చేజార్చుకుని సిరీస్ ను పోగొట్టుకునే స్థితికి పడిపోయింది.      


మరింత సమాచారం తెలుసుకోండి: