టీమిండియా కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ గత కొంతకాలం నుంచి మాత్రం పేలవమైన ప్రదర్శన చేస్తున్నాడు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ లో బరిలోకి దిగిన టీమిండియా జట్టు పెద్దగా చెప్పుకొద్దగా విజయాలు కూడా సాధించలేకపోతూ ఉండడంతో ఎంతోమంది అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా ఒక కెప్టెన్ గా ఒక ఆటగాడిగా జట్టుకు ఎంతో భారంగా మారిపోతున్న రోహిత్ శర్మను పక్కకు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ  అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.


 మరోవైపు ఇక ప్రతి మ్యాచ్ లో కూడా రోహిత్ శర్మ భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం.. ఇక ఆ తర్వాత  సింగిల్ డిజిట్ స్కోర్ మాత్రమే చేసి వికెట్లు కోల్పోవడం లాంటివి చేస్తూ ఉన్నాడు రోహిత్ శర్మ. దీంతో రోహిత్ నువ్వు ఇక మారవా అంటూ అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి రోహిత్ శర్మ ఇటీవల తన బ్యాటింగ్తో ఏకంగా క్రికెట్ ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు అని చెప్పాలి. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో గాయం కారణంగా రోహిత్ శర్మ బ్యాటింగ్కు దూరంగానే ఉన్నాడు. కానీ చివరిలో టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో రోహిత్ బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.


 అక్కడికి అతని చేతికి గాయం అయి కుట్లు కూడా పడ్డాయ్. అయినప్పటికీ  లెక్క చేయలేదు రోహిత్ శర్మ. అయితే రోహిత్ శర్మ ఏకంగా గాయాన్ని కూడా లెక్కచేయకుండా వచ్చి మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ కూడా టీమిండియా గట్టెక్క లేకపోయింది  అని చెప్పాలి. 28 బంతుల్లోనే 5 సిక్సర్లు మూడు ఫోర్లతో 51 పరుగులు చేశాడు. కానీ సిరాజ్ రెండు ఓవర్లు వేస్ట్ చేయడంతో చివరికి మ్యాచ్ ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే గాయంతో కూడా బరిలోకి దిగి టీమ్ ఇండియా విజయం కోసం పోరాడిన రోహిత్ శర్మ అందరి మనసులు దోచేశాడు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: