సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో ఇక ఆటగాళ్లు తాము సాధించింది సెలబ్రేట్ చేసుకోవడానికి కొన్ని కొన్ని సార్లు కాస్త కొత్తగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఆటగాళ్లు ఎవరైనా సరే వినూత్నమైన రీతిలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు అంటే చాలు ఇక అందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇప్పటివరకు మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆటగాళ్లు వింతైన సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎన్నోసార్లు చూశాం. కానీ ఇటీవల సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్లో మాత్రం ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది అని చెప్పాలి. మైదానంలో పాతుకుపోయి మంచి బ్యాటింగ్ చేస్తున్న ఒక బ్యాట్స్మెన్ ఏకంగా డ్రెస్సింగ్ రూమ్ వైపు విచిత్రమైన సైగా చేశాడు. ఏకంగా తనకు సిగరెట్ లైటర్ కావాలి అంటూ సైగా చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. తను ఎందుకు సిగరెట్ లైటర్ అడుగుతున్నాడు అర్థం కాక డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న సహసర ఆటగాళ్లు తలగోక్కున్నారు అని చెప్పాలి. అంతేకాదు ఇక కామెంట్రీ ప్యానెల్ లో ఉన్న కామెంటెటర్లు సైతం ఇందుకోసం చర్చించుకున్నారు.


 ఇటీవల సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో భాగంగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ మార్నస్ లభూషేణ్ సిగరెట్ లైటర్ కావాలంటు డ్రెస్సింగ్ రూమ్ వైపు సైగ చేశాడు అని చెప్పాలి. అయితే ఇలా సైగ చేయడానికి పెద్ద కారణమే ఉంది.  అప్పటికే చాలా సేపు హెల్మెట్ తో సమస్యను ఎదుర్కొంటున్నాడు మార్నస్ లభూషేణ్. దీంతో దాన్ని రిపేర్ చేసేందుకుగాను సిగరెట్ లైటర్ తేవాలని డ్రెస్సింగ్ రూమ్ కు మెసేజ్ పంపాడు. కానీ మొదట సహచర ఆటగాళ్లకు అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత అర్థం చేసుకొని లైటర్ తీసుకురావడంతో హెల్మెట్ తో ఉన్న సమస్యను పరిష్కరించుకున్నాడు మార్నస్ లభూషేణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: