సొంత గడ్డపై వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతున్న భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే శ్రీలంక పై రెండు సిరీస్ లలో విజయం సాధించిన టీమిండియా ఇక ఇప్పుడు న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడుతుంది. వన్డే సిరీస్ లో కూడా అదే జోరు కొనసాగించింది. మొదటి వన్డే మ్యాచ్ లో 12 పరుగులు తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం రెండో వన్డే మ్యాచ్ జరుగుతుంది అని చెప్పాలి. ఇక రెండో వన్డే మ్యాచ్లో కూడా అటు గెలుపు దిశగా ప్రయాణం చేస్తుంది టీమిండియా.


 బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న టీమ్ ఇండియా జట్టు ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోని రెండో వన్డే మ్యాచ్లో కూడా అదరగొట్టింది. ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టులో ఎంతోమంది మంచి బ్యాట్స్మెన్లు ఉన్నప్పటికీ భారత బౌలింగ్ విభాగం మాత్రం వారిని తక్కువ పరుగులకే కట్టడం చేసింది.  దీంతో ఇక అటు న్యూజిలాండ్ బ్యాటింగ్ విభాగం మొత్తం పేక మెడల కూలిపోయింది అని చెప్పాలి. 34.3 ఓవర్లలో కేవలం 108 పరుగులు మాత్రమే చేసి ఇక ఆల్ అవుట్ అయింది న్యూజిలాండ్ జట్టు.


 ఈ క్రమంలోనే స్వల్ప టార్గెట్ తో అటు టీమిండియా బరిలోకి దిగింది అని చెప్పాలి. ఇకపోతే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సమయంలో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్టన్నింగ్ క్యాచ్ తో మెరిశాడు. సాధారణంగానే హార్దిక్ పాండ్య మైదానంలో పాదరసంలా కదులుతూ మెరుపు ఫీల్డింగ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సమయంలో 10 ఓవర్లో ఇది చోటు చేసుకుంది. 10 ఓవర్ హార్దిక్ పాండ్యా నే బౌలింగ్ వేసాడు. నాలుగో బంతిని ఆఫ్ సైడ్ దిశగా వేయగా కాన్వే డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే స్ట్రైట్ షాట్ ఆడాడు. దీంతో పాండ్యా ఒకవైపు డ్రైవ్ చేస్తూ ఒంటిచేతో  క్యాచ్ అందుకున్నాడు. పాండ్య క్యాచ్ చూసిన కాన్వే బిక్క ముఖం వేశాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: