ఇక అనుకున్నట్లుగానే తన ప్రణాళికలను అమలు చేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేసి చెలరేగిపోయాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న శిఖర్ ధావన్ ఏకంగా 86 పరుగులు చేసి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. దీంతో ఇక 2023 ఐపీఎల్ సీజన్లో బోణి కొట్టింది పంజాబ. ఇకపోతే ఇక ఇలా రాజస్థాన్ తో మ్యాచ్లో 86 పరుగులు చేయడం ద్వారా ఎన్నో అరుదైన రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
అత్యధిక 50 ప్లస్ స్కోర్ లు సాధించిన రెండో ప్లేయర్గా ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డును సృష్టించాడు శిఖర్ ధావన్. అదే సమయంలో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ఫోర్లు కొట్టిన ఓపనర్ గా కూడా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఇప్పటివరకు ధావన్ తన ఐపీఎల్ కెరియర్ లో 864 ఫోర్లు కొట్టాడు అని చెప్పాలి. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్ లో 9 ఫోర్లు కొట్టడం ద్వారా ఇక ఈ రికార్డును సాధించాడు. ఇక శిఖర్ ధావన్ తర్వాత స్థానాల్లో డేవిడ్ వార్నర్ 733 ఫోర్లతో ఉండగా.. క్రిస్కేల్ 694 ఫోర్లు, గౌతమ్ గంభీర్ 477 ఫోర్ లతో తర్వాత స్థానాలలో ఉన్నారు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి