ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి మేలు రకం దున్న గురించి అని చెప్పాలి. హరియానాకు చెందిన ముర్రా జాతి దున్నపోతు షేహన్ షా కు ఉన్న డిమాండ్ ముందు లగ్జరీ కార్ల ధరలు కూడా దిగదుడిపే అని చెప్పాలి. ఎందుకంటే ఈ గేదెను కొన్న ధరతో ఏకంగా లగ్జరీ కార్లు ఒకటి కాదు రెండు కాదు అంతకంటే ఎక్కువే కొనేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకో తెలుసా ఏకంగా ఈ దున్న ధర అక్షరాల 25 కోట్ల రూపాయలు. వినడానికే షాకింగ్ గా ఉంది కదా.. కానీ నిజంగానే ఈ దున్నకు ఆ రేంజ్ లో డిమాండ్ ఉంది అని చెప్పాలి. పనిపాత్ జిల్లా దిడ్వాడి గ్రామానికి చెందిన నరేంద్ర సింగ్ అనే రైతు ఈ మేలు రకం దున్నపోతును పెంచుకుంటున్నాడు.
దీని ముద్దు పేరు శేహన్ షా. దీని వయసు పదేళ్లు కావడం గమనార్హం. 15 అడుగుల పొడవు, ఆరడుగుల ఎత్తు ఉంటుంది ఈ దున్న. వీటి వీర్యానికి మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా భారీ డిమాండ్ ఉంది అని చెప్పాలి. ఇక నెలలో నాలుగు సార్లు షేహన్ షా వీర్యాన్ని బయటకి తీస్తారు అని చెప్పాలి. ఇక ఈ వీర్యంతో దాదాపు 800 డోసులు తయారు చేస్తారు. ఇక వీటిని వేరు చేసే ప్రక్రియలో ప్రతి డోస్ కు 300 రూపాయల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పాలి. అనంతరం దీనిని మార్కెట్లో విక్రయించి ఇక నెలకు 9.60 లక్షల వరకు సంపాదిస్తున్నాడట షేహన్ షా యజమాని నరేంద్ర సింగ్. అందుకే ఈ ముర్రా జాతి దున్నలను హరియాణాలో నల్ల బంగారం అని కూడా అంటూ ఉంటారట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి