ఇటీవల ఐపీఎల్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లు సైతం శుభమన్ గిల్ మెరుపు సెంచరీ తో చెలరేగిపోయాడు అన్న విషయం తెలిసిందే. సన్రైజర్స్ బౌలర్లతో చెడుగుడు ఆడేశాడు. సిక్సర్లు ఫోర్ లతో చెలరేగి పోతు సూపర్ సెంచరీని అందుకున్నాడు. అంతే కాదు ఇక ఐపీఎల్ హిస్టరీలో తొలి సెంచరీ నమోదు చేశాడు ఈ యంగ్ సెన్సేషన్ ప్లేయర్. ఈ క్రమంలోనె ఈ సెంచరీ ద్వారా అతుకు గుజరాత్ టైటాన్స్ కి ఘన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర వహించడమే కాదు ఒక అరుదైన రికార్డును కూడా సృష్టించాడు గిల్.
ఒకే క్యాలెండర్ ఇయర్ లో టెస్ట్ ఫార్మాట్ వన్డే ఫార్మాట్ టి20 ఫార్మట్లలో సెంచరీ చేసిన భారత క్రికెటర్ గా అరుదైన రికార్డును సృష్టించాడు కాగా శుభమన్ గిల్ ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో మూడు సెంచరీలు చేయగా.. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది అని చెప్పాలి. ఇక టెస్ట్ టి20 ఫార్మాట్లలో కూడా ఒక్కో శతకాన్ని బాదాడు గిల్. అయితే అతను టెస్ట్ టి20 ఐపిఎల్ సెంచరీలు అహ్మదాబాద్ మైదానంలోనే కొట్టడం గమనార్హం. దీంతో ఇక శుభమన్ గిల్ కు అహ్మదాబాద్ .. లక్కీ గ్రౌండ్ గా మారిపోయింది అని చెప్పాలి.. అయితే గిల్ అసమాన్యమైన ప్రతిభ పై మాజీ క్రికెటర్లు ప్రస్తుతం ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి