
అయితే ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ఎంతోమంది ప్లేయర్లకు ఏ స్పోర్ట్స్ ఛానల్ కు వెళ్లిన కూడా అటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీ మధ్య తేడా ఏంటి అని ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఒకప్పుడు విరాట్ కోహ్లీ సారథ్యం వహించిన సమయంలో.. ఇక ఇప్పుడు రోహిత్ కెప్టెన్ గా ఉన్న సమయంలో కూడా జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగిన కేఎల్ రాహుల్ ఇటీవల రోహిత్ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ చురుకైన కెప్టెన్ అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.
ప్రతి మ్యాచ్ లో కూడా ఆటకు ముందు రోహిత్ శర్మ చాలా హోంవర్క్ చేస్తాడు. ప్రతి ప్లేయర్ బలాల గురించి ముందే తెలుసుకుంటాడు. ఇక గేమ్ గురించి బాగా అవగాహన కలిగి ఉంటాడు. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే రోహిత్ శర్మ సరైన నిర్ణయాలు తీసుకుంటాడు అంటూ కే ఎల్ రాహుల్ రోహిత్ కెప్టెన్సి పై ప్రశంసల కురిపించాడు. ఇకపోతే ప్రస్తుతం కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఒకవైపు ఐపిఎల్ టోర్నీకి మరోవైపు డబ్ల్యూటీసి ఫైనల్ కి కూడా దూరం అయ్యాడు అనే విషయం తెలిసిందే. ఇక కేఎల్ రాహుల్ వరల్డ్ కప్ కి అందుబాటులోకి వస్తాడా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.