
నిపుణుల ప్రకారం 120 డెసిబెల్స్ చెవులకు చిల్లుపడేలా చేస్తాయి. చెవులకు శాశ్వతంగా హాని కూడా చేయగలవు. కానీ ప్రేమతో ధోనీ అభిమానులు ఆరిచారు కాబట్టి దీనిని హానికరమనడం అంగీకార యోగ్యం కాకపోవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) హోమ్‌గ్రౌండ్ అయిన MA చిదంబరం స్టేడియం (చెపాక్)లో ధోనీ కోసం అభిమానులు చేసిన హోరు ఎలా ఉందో, లక్నో, ఢిల్లీలో వారు చేసిన గోల కూడా అదే స్థాయిలో ఉండటం గమనార్హం. అంటే సొంత మైదానం, వేరే స్టేడియం అని కూడా చూడకుండా అభిమానులు నలు దిక్కులు పిక్కటిల్లేలా అరిచి తమ ప్రేమను చాటుకున్నారు. లక్నో, ఢిల్లీలో వారు చేసిన నాయిస్ డెసిబెల్ స్థాయిలు 117కి చేరుకున్నాయి.
2023 ఐపీఎల్లో వేర్వేరు సందర్భాలలో మైదానంలో ధోనీ కోసం ఫ్యాన్స్ చేసిన హోరు 112, 120, 117, 115, 115, 112, 112, 112, 117, 120, 115, 120 ఇలా భారీ డెసిబెల్ స్థాయిలలో నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌కి 5 టైటిల్స్ ని అందించడంలో ధోనీ కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ రేంజ్ లో ఫ్యాన్స్ అరవడం నిజంగా అబ్బురపడాల్సిన విషయమే. ఇంకా విశేషమేంటంటే ధోని టాస్ గెలిచినప్పుడు అభిమానులు చేసిన కేరింత వల్ల కామెంటేటర్ ఎవరు గెలిచారో కూడా తెలుసుకోలేకపోయాడు. చివరికి ధోనీనికి సైగలు చేసి అతను బ్యాటింగ్ ఎంచుకున్నాడని తెలుసుకున్నాడు. అంటే వారు చెవులు ఎంత గట్టిగా అరిచారో అర్థం చేసుకోవచ్చు.