భారత క్రికెట్ లో ఎంతమంది బౌలర్లు ఉన్నప్పటికీ అటు రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఎంతో తెలివైన స్పిన్నర్ అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఏ బ్యాట్స్మెన్ కి ఎక్కడ వేస్తే అతను వికెట్ సమర్పించుకుంటాడు అన్న విషయం అశ్విన్ కు బాగా తెలుసు. ఈ క్రమంలోనే తనదైన బౌలింగ్ శైలితో ఇక ఎప్పుడూ బ్యాట్స్మెన్లను తికమక పెట్టి వికెట్లు దక్కించుకుంటూ ఉంటాడు. టి20 ఫార్మాట్లో సైతం ఏకంగా అశ్విన్ కొన్ని కొన్ని సార్లు మొదటి ఓవర్ వేస్తాడు అంటే ఇక అతనిపై కెప్టెన్ ఎంత నమ్మకం పెట్టుకుంటాడో అర్థం చేసుకోవచ్చు.


 అలాంటి అశ్విన్ ఇక భారత జట్టు కీలకమైన మ్యాచ్లు ఆడిన ప్రతిసారి కూడా తుది జట్టులో కనిపిస్తూ ఉంటాడు అని చెప్పాలి. కానీ ప్రస్తుతం టీమిండియా ఆడుతున్న ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో మాత్రం అశ్విన్ కు తుది జట్టులో చోటు తగ్గకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది అని చెప్పాలి. అయితే స్పిన్ ఆల్ రౌండర్ గా ఉన్న రవీంద్ర జడేజాతో పాటు అటు రవిచంద్రన్ అశ్విన్ కు కూడా జట్టులో చోటు దక్కుతుందని అందరూ భావించారు. ఇక అతను జట్టులో ఉంటే టీమిండియా బౌలింగ్ విభాగం ఎంతో పటిష్టంగా ఉంటుందని అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో అతన్ని పక్కన పెట్టేశారు సెలెక్టర్లు.


 స్పిన్ ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకున్న సెలెక్టర్లు ఇక మరో స్పిన్నర్ లేకుండా నలుగురు ఫేసర్లతోనే బలిలోకి దిగారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇదే విషయంపై అటు టీమిండియా ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఐసీసీ నెంబర్ వన్ టెస్ట్ బౌలర్ అయిన అశ్విన్ ను తీసుకోకుండా టీమిండియా పెద్ద తప్పు చేసిందంటూ.. సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అనుభవజ్ఞుడైన బౌలర్ లేని లోటు టీమిండియాలో స్పష్టంగా కనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అందువల్లే ఆస్ట్రేలియా బ్యాటర్లను అవుట్ చేయడం కష్టతరం అవుతుంది. అశ్విన్ ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Etc