అయితే ఇటీవల కాలంలో అటు క్రికెట్లో కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్న ఎంతోమంది క్రికెటర్లు కొత్త కొత్త బిజినెస్ లు ప్రారంభిస్తూ ఇక అందులోనూ సక్సెస్ అవుతున్నారు అని చెప్పాలి. కేవలం ప్రజెంట్ ఆటగాళ్లు మాత్రమే కాదు ఇక మాజీ ఆటగాళ్ళు సైతం ఇలా కొత్త వ్యాపారం లోకి అడుగుపెడుతూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా సైతం ఇటీవల ఒక కొత్త బిజినెస్ ని ప్రారంభించాడు.
ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏకంగా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులు అందరితో కూడా పంచుకున్నాడు సురేష్ రైనా. అయితే ఈ రెస్టారెంట్ మనదేశంలోనే కాదు నెదర్లాండ్స్ లోని హామ్స్టర్ డ్యామ్ లో ఓపెన్ చేసాడట సురేష్ రైనా. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశాడు. ఇక రెస్టారెంట్ కు రైనా ఇండియన్ రెస్టారెంట్ అనే పేరు కూడా పెట్టినట్లు వెల్లడించాడు. కాగా భారత క్రికెట్ లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన సురేష్ రైనా మరికొన్ని రోజుల్లో జరగబోయే శ్రీలంక ప్రీమియర్ లీగ్ లో ఆడబోతున్నాడు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి