ఇక ఇటీవల డైమండ్ లీగ్ లో కూడా మరోసారి నీరజ్ చోప్రా తన సూపర్ ఫామ్ను కొనసాగించాడు. జావలిన్ త్రో విసిరి మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. గాయం నుంచి కోలుకొని ఈ టోర్నీ ద్వారా పునరాగం మనం చేసాడు నీరజ్ చోప్రా. ఈ క్రమంలోనే ఇటీవలే టోర్నీలో భాగంగా జావలెన్ ను 87.66 మీటర్లు విసిరి నెంబర్ వన్ స్థానంలో నిలిచి విజేతగా అవతరించాడు అని చెప్పాలి. హేమా హేమీలు బరిలో నిలిచిన ఈ పోటీలో నీరజ్ తొలి ప్రయత్నం లోనే విఫలమయ్యాడు. అయితే రెండో ప్రయత్నంలో 83.52 మీటర్లు, మూడో ప్రయత్నంలో 85.04 మీటర్లు విసిరాడు నీరజ్ చోప్రా.
అయితే నాలుగో ప్రయత్నంలో మళ్లీ విఫలమైన నీరజ్ చోప్రా ఐదో ప్రయత్నంలో మాత్రం 87.66 మీటర్లు విసిరి ఒక్కసారిగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇకపోతే రెండో స్థానంలో నిలిచిన జర్మనీకి చెందిన వేబర్ 87.03 మీటర్లు విసరగా.. మూడో స్థానంలో నిలిచిన జాకబ్ వార్లిచ్ 86.13 మీటర్లు విసిరాడు. Kaaga ఈ ఏడాది ఖతార్లో జరిగిన దోహా డైమండ్ లీగ్ లో టోర్నీలో అగ్రస్థానానికి చేరుకున్న నీరజ్ చోప్రా.. తర్వాత కండర గాయంతో పావొ నూర్మి ఈవెంట్ కు దూరమయ్యాడు. ఇక ఇటీవల రీఎంట్రీలో అదరగొట్టాడు. అగ్రస్థానంలో నిలిచిన నీరజ్ చోప్రాకి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి