వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన జట్టుగా కొనసాగుతున్న ఆస్ట్రేలియా ఇక ఇటీవలే కాలంలో అటు చీటింగ్ కీ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందా  అంటే ఇటీవల కాలంలో ఆ జట్టు ఆటగాళ్ళ ప్రవర్తన తీరు చూసి అందరూ అవును అనే సమాధానం చెబుతున్నారు. ఎందుకంటే నేలకు తాకిన క్యాచ్ లను సైతం క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించకుండా అవుట్ అంటూ అప్పీల్ చేయడం ఏకంగా వివాదాస్పద రీతిలో బ్యాట్స్మెన్లను అవుట్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల సిరీస్ లో భాగంగా అటు ఇంగ్లాండ్ బ్యాటర్ బెయిర్ స్ట్రో ని అవుట్ చేసిన విధానం అయితే ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది.


 ఏకంగా బెయిర్ స్ట్రో ను అవుట్ చేసిన విధానం వివాదాస్పదంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే బెయిర్ స్ట్రోను కెరి స్టంప్ అవుట్ చేసిన విధానం పై ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్ల మధ్య కాదు.. రెండు దేశాల ప్రధాన మధ్య కూడా మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఇక ఇదే విషయం గురించి భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ వేదిక స్పందించాడు. క్రికెట్లో బేసిక్ రూల్ కూడా బెయిర్ స్ట్రో పాటించలేదని అశ్విన్ అతన్ని నిందించాడు.


బెయిర్ స్ట్రో అవుట్ విషయంలో ఒక చర్చ జరుగుతుంది. అయితే ఓవర్లో చివరి బంతి కావడంతో అతడు బంతి వదిలేసిన తర్వాత నాన్ స్ట్రైకర్తో మాట్లాడడానికి వచ్చాడు. రిప్లై మరోసారి చూడండి.. కేరి ఒక్క సెకండ్ కూడా ఆగకుండా బంతి స్టంప్స్ వైపు విసిరాడు. అతనికి ముందే తెలుసు బెయిర్ స్ట్రో క్రీజు వదులుతాడని. స్టంప్స్ వెనక ఒక్కసారి కూడా చూడకుండా అతను క్రీజు వదిలాడు అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు. క్రికెట్లో ఇది చాలా బేసిక్ రూల్. బంతిని ఫాలో అవుతూ క్రీజు వదలాలి.. రంజి ట్రోఫీలో కూడా బ్యాట్స్మెన్, వికెట్ కీపర్, స్లీపర్ ఫీల్డర్ ను చూసిన తర్వాత క్రీజు వదులుతారు. ఎందుకంటే వాళ్లు స్టంప్స్ పైకి బాల్ విసరగలరు. అది కచ్చితంగా నిబంధనలకు కట్టుబడి ఉంటుంది  అంటూ అశ్విన్ ఏకంగా అలెక్స్ కెరీకి మద్దతు పలికాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: