అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఆ జట్టు ఫేట్ మాత్రం అస్సలు మారడం లేదు. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి మొన్నటికి మొన్న ముగిసిన సీజన్ వరకు కూడా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ప్రతిసారి ఈ సాల కప్ నమ్దే అంటూ ఆర్సిబి ఫ్యాన్స్ హడావిడి చేయడం తప్ప.. వారి కల నెరవేరే రోజు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అయితే జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ బెంగళూరు టీం ఎందుకు టైటిల్ గెలవలేక పోతుంది.. అసలు లోపం ఎక్కడుంది అన్న విషయంపై కూడా ఎప్పుడూ ఫ్యాన్స్ కన్ఫ్యూజన్లో పడిపోతూ ఉంటారు.
అయితే ఇదే విషయం గురించి భారత స్పిన్నర్ బెంగళూరు జట్టు మాజీ ఆటగాడు.. చాహల్ చక్కని సమాధానం చెప్పాడు. 2014 నుంచి 2021 వరకు దాదాపు 8 సీసన్స్ పాటు బెంగళూరుకు ఆడాడు. అయితే గత ఎడారి జట్టు నుంచి తప్పుకున్నాడు చాహల్. ఇక ఆర్సీబీ టైటిల్ గెలిచే అవకాశాల గురించి చెప్పుకుంటూ.. 2016 సీజన్ క్రిస్ గేల్, రాహుల్, కోహ్లీ, డివిలియర్స్, స్టార్క్ ఇలా మా జట్టు చాలా బలంగా ఉంది. మొదట్లో కొన్ని మ్యాచ్లు ఓడినా చివరిగా ఏడు మ్యాచ్లలో ఆరు గెలిచాం.. వరుస విజయాలతో మాలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. ఆపై గుజరాత్ తో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్ గెలిచి ఫైనల్ అడుగుపెట్టాం. మరో ఎండ్ లో సన్రైజర్స్ అర్హత సాధించింది. ఫైనల్ చిన్నస్వామి స్టేడియంలో కనుక విజయ మాదే అనుకున్నాం. కానీ ఆ మ్యాచ్ లో 8 పరుగులు తేడాతో ఓడిపోయాం. ఓడటం రెండు రకాలు ఒకటి ప్రయత్నించి ఓడటం.. మరొకటి మొదటి నుంచి ఓడిపోవడం.. మంచిగా ఆడి ఓడిపోతే ఓటమి గురించి పెద్దగా బాధపడం.. ఒకసారి మేము వరుసగా ఓడిపోయాక.. ఏడో మ్యాచ్ గెలిచాం.. టైటిల్ గెలిచినట్లు సంబరాలు చేసుకున్నాం. రాజస్థాన్ బాగా ఆడిన అర్హత సాధించలేకపోయింది. కనుక టైటిల్ గురించి పెద్దగా ఆలోచించం అంటూ చాహల్ చెప్పుకొచ్చాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి